రాయితీ వోచర్లతో జీతాలు చెల్లించా!
close
Published : 22/08/2021 00:50 IST

రాయితీ వోచర్లతో జీతాలు చెల్లించా!

ఎంతో ఇష్టంగా ఏర్పరుచుకున్న ఆమె కలల సామ్రాజ్యం అది... ప్రకృతితో సావాసం... రుచికరమైన ఆహారంతో పుస్తక ప్రియులకు స్వర్గధామంగా చంపక్‌ని తీర్చిదిద్దారు. ఓ ప్రత్యేక గుర్తింపు అందుకున్న ఆమె స్టార్టప్‌... కరోనాతో కొన్నాళ్లకే తలకిందులయ్యింది.  అప్పుడే వినూత్న ప్రత్యామ్నాయం వెతికి... దాన్ని నిలబెట్టుకున్నారు.  ఆమే బెంగళూరుకి చెందిన రాధికా టింబాడియా! ఆ కథ మనమూ తెలుసుకుందామా...

ముంబయిలో పుట్టిపెరిగిన రాధికకు పుస్తకాలంటే వల్లమాలిన ప్రేమ. అది వాళ్ల నాన్న నుంచే వచ్చింది. తాను చదివిన నవలల్లోని పాత్రలను ఊహకి తగ్గట్లుగా కథలు అల్లి ఆసక్తికరంగా చెప్పే వారాయన. పాత పుస్తకాల షాపులెన్నింటికో తీసుకువెళ్లేవారు. ‘ఓ సారి ముంబయిలోని రోడ్డుపక్కన ఓ షాపుకి వెళ్లా. అక్కడో యువకుడు... కస్టమర్లు ఎలాంటి పుస్తకాలు ఇష్టపడతారు, ఏ రచయిత ఎలా రాస్తారు? ప్రసిద్ధ పుస్తకాలు- వాటి వెనక కథల వంటివెన్నో అనర్గళంగా చెప్పేశాడు. అప్పటి నుంచే పుస్తకాల గురించి ఇష్టం పెరిగింది’ అంటారామె. రాధిక పర్యావరణ శాస్త్రవేత్తగా బెంగళూరులో స్థిరపడింది. అప్పుడూ ఎన్నో పుస్తకాల షాపులకు, లైబ్రరీలకు తిరిగారు. పుస్తకాలు చాలానే ఉన్నా... తనక్కావలసింది వెతుక్కోవడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అదే చంపక ల్రైబరీ-కేఫ్‌ని ఏర్పాటుకి కారణమయ్యింది. ‘ఓ సాయంత్రం ఆక్టేవియా బట్లర్‌, ఎన్‌కే జెమిసిన్‌, ఉర్సులా కె లే గుయిన్‌ పుస్తక సమీక్షలు చదువుతున్నా. వారంతా అవార్డులు గెలుచుకున్న రచయిత్రులు. కానీ వారి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఇలాంటివాటితో పాటు అద్భుతమైన పుస్తకాలెన్నో అందరికీ అందుబాటులో లేవనే సంగతి గుర్తొచ్చింది. వాటిని భద్రపరచాలనుకున్నా. దాంతో పాటే ప్రశాంత వాతావరణంలో పుస్తక పఠనం, సమీక్షలు జరుపుకునేందుకు వీలుగా ఓ కెఫే ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అదే చంపక అని గుర్తుచేసుకుంటారు.

పురుషాధిక్య రంగంలో... ‘నాకల ...సాకారమవ్వడానికి  కావ్యామూర్తి, తేజశ్వి శివానంద్‌, పూజా సక్సేనా, రోహిణీ కేజ్రీవాల్‌, నిరికా శ్రీనివాసన్‌ సాయపడ్డారు. ఇక మా సంస్థలో సభ్యులు కాని మరెందరో తమ ముద్రణలను మాకు తెచ్చి ఇచ్చారు. మరో పక్క పిల్లలకోసం రీడింగ్‌ కార్నర్‌ ఏర్పాటు చేశారు. పుస్తక రచయితలు, క్యూరేటర్లతో వివిధ సెషన్లూ నిర్వహించేవారు’ అని చెబుతారు రాధిక.

ఆన్‌లైన్‌తో ఊపిరి పోశారు... ఈ లైబ్రరీ కెఫేని ఏర్పాటు చేయడానికి ముందు రెండేళ్లు ఓ బుక్‌స్టోర్‌లో ఇంటర్న్‌ చేశారు. గోవాలోని బుక్‌వార్మ్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తోన్న ఎడ్యుకేటర్‌ కోర్సు పూర్తిచేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. కష్టం కరోనా రూపంలో వచ్చింది. లాక్‌డౌన్‌తో కేఫ్‌ని మూసేయాల్సి వచ్చింది. కానీ సిబ్బందికి అండగా నిలవాలి. మరోపక్క లక్ష్యం నీరు గారకూడదు... అందుకే ప్రత్యామ్నాయం ఆలోచించారు రాధిక. మరుసటి నెలే ఆన్‌లైన్‌కి మారిపోయారు. పాఠకులను మెప్పించడానికి, వారికి దగ్గరవ్వడానికి గిఫ్ట్‌వోచర్‌ కార్యక్రమం ప్రారంభించారు. ‘ప్రపంచం అకస్మాత్తుగా మారింది. దాన్ని అంగీకరించాలి. సంవత్సరంలో ఎప్పుడైనా పదిశాతం తగ్గింపుతో మా గిఫ్ట్‌ వోచర్‌ని రెడిమ్‌ చేసుకోవచ్చు. దీనికి మంచి స్పందన వచ్చింది. వాటితోనే... సిబ్బందికి జీతాలు చెల్లించాం. కరోనా ఉన్నంత కాలం ఈ విధానంలోనే మా లైబ్రరీ సాగుతోంది.’ అంటారామె.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని