కొంచెం స్మార్ట్‌గా నెలవారీ ఖర్చు తగ్గిద్దామిలా! - smart ways to reduce monthly bills in telugu
close
Published : 30/09/2021 18:25 IST

కొంచెం స్మార్ట్‌గా నెలవారీ ఖర్చు తగ్గిద్దామిలా!

ప్రస్తుతం టెక్నాలజీ మన జీవితంలో ఎంతలా భాగమయ్యిందో అందరికీ తెలిసిందే. దాంతో ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ వంటివి నిత్యావసరాలుగా మారాయి. ఫలితంగా ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వీటిపై ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం రండి..

కూపన్లను ఉపయోగించండి..

ఈ రోజుల్లో నిత్యావసర వస్తువులను సైతం ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. అయితే ఇలా ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు కూడా కొంచెం తెలివిగా ఆలోచిస్తే డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆఫర్లు ప్రకటిస్తారో అప్పుడే నెలకు సరిపడా గ్రాసరీని కొనుగోలు చేయడం వల్ల ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే పేమెంట్‌ వ్యాలెట్ల ద్వారా లావాదేవీలు చేసినప్పుడు కొన్ని రకాల కూపన్లు వస్తుంటాయి. వాటిని షాపింగ్‌ చేసేటప్పుడు ఉపయోగించడం వల్ల కొద్దిమొత్తంలో మీ నెలవారీ బిల్లు ఆదా అవుతుంది.

కలిపి తీసుకోవాలి...

హ్యాండ్‌బ్యాగ్‌లో ఫోను, ఇంట్లో టీవీ అనేది ఇప్పుడు తప్పనిసరి. కానీ, వాటి బిల్లులు నెలా నెలా తడిసి మోపెడవుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఖర్చులను కూడా కొంతమేర తగ్గించుకోవచ్చు. కొన్ని కంపెనీలు ఇంటర్నెట్‌, ఫోన్‌, డీటీహెచ్‌ సర్వీసులను ఒకే ప్లాన్‌లో ఇస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తుంటాయి. విడివిడిగా కాకుండా ఇలా ప్యాకేజీగా తీసుకుంటే వీటిపై ఉండే ఖర్చులను తగ్గించుకోవచ్చు.

ఆన్‌లైన్‌ షాపింగా..?

ఇంట్లో నుండి కాలు బయటపెట్టకుండా అన్ని వస్తువులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇందులో కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో ఉండే ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి, మీకు కావాల్సిన వస్తువులను విష్‌లిస్ట్‌లో పెట్టుకుని ఒకటి లేదా రెండు వారాలు చూడండి. ఎప్పుడు తక్కువ ధర ఉంటే అప్పుడు వాటిని కొనుగోలు చేయండి. ఫలితంగా కొద్దిమొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్ వెబ్‌సైట్లు కొన్ని రకాల పండగలు, సందర్భాల్లో ఫ్లాష్‌ సేల్స్‌ ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో తక్కువ ధరకే మనకు కావాల్సిన వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది.

ఇవే కాకుండా నెలవారీ బిల్లులను తగ్గించుకోవడానికి ఈ కింది చిట్కాలు కూడా కొంతవరకు ఉపయోగపడతాయి:

* మన నెలవారీ బిల్లుల్లో కరెంటు బిల్లు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బిల్లు తడిసి మోపెడవడానికి కారణం ఎలక్ట్రిక్‌ వస్తువులను ఎక్కువగా ఉపయోగించడమని అందరికీ తెలుసు. అయితే ఏసీ, ఫ్రిజ్‌లు ఎక్కువ స్టార్లు ఉన్నవి తీసుకోవడం, ఎల్‌ఈడీ బల్బులు, ఫ్యాన్లను ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లులను కొంతమేర తగ్గించుకోవచ్చు.

* చాలామంది క్రెడిట్‌ కార్డులను విచ్చలవిడిగా వాడుతుంటారు. తీరా, బిల్లు కట్టే సరికి జీతమంతా క్రెడిట్‌ కార్డు బిల్లుకే సరిపోతుంది. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నవారైతే వీలైనంత వరకు క్రెడిట్‌ కార్డు వినియోగం తగ్గించండి. లేకపోతే క్రెడిట్‌ కార్డులను తీసేసి కేవలం డెబిట్‌ కార్డు వరకు మాత్రమే పరిమితమవ్వండి.

* సొంత వాహనాలు ఉపయోగించడం వల్ల ఎక్కువ ఖర్చవ్వడమే కాకుండా పర్యావరణానికి హానికరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్, కార్‌ పూలింగ్, క్యాబ్‌ సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా కొంతమేర ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం కూడా తగ్గుతుంది. అయితే కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మరవద్దు.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని