కాయగూరల వ్యర్థాలే కాగితాలై..! - this 11 years eco warrior is turning vegetable waste in to paper
close
Published : 23/08/2021 18:25 IST

కాయగూరల వ్యర్థాలే కాగితాలై..!

(Photo: Instagram)

ఇంట్లో రకరకాల కూరగాయల్ని, పండ్లని తొక్క తీసి ఉపయోగించుకుంటాం. ఆ తొక్కల్ని డస్ట్‌బిన్‌లో పడేస్తాం. అయితే ఈ కూరగాయల తొక్కలతోనే పర్యావరణహిత పేపర్లు తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన మాన్య హర్ష. పర్యావరణమంటే ఎంతో ప్రేమ చూపించే ఈ 11 ఏళ్ల చిన్నారి.. చెట్లను నరకడమంటే మన వేలితో మన కళ్లు పొడుచుకున్నట్లేనంటోంది. అందుకే చెట్ల కలపతో కాకుండా కూరగాయల వ్యర్థాలతో పేపర్‌ తయారుచేస్తూ అందరిలో పర్యావరణ స్పృహ పెంచుతోంది.

8 ఏళ్ల వయసు నుంచే!

ప్రస్తుతం బెంగళూరులోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది హర్ష. ఆమె తల్లిదండ్రులు ప్రకృతి ప్రేమికులు. పైగా వారికి ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి. అలా వారిని చూస్తూనే పెరిగిన హర్ష.. బాల్యం నుంచే ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టింది. తన 8 ఏళ్ల వయసులోనే ‘వరల్డ్‌ వాటర్‌ డే’ సందర్భంగా నీటి వినియోగం, పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ.. పిల్లలు, పెద్దలతో కలిసి ‘కిడ్స్‌ వాక్‌థాన్‌’ నిర్వహించింది. తల్లిదండ్రులు, మరికొంతమంది సహాయంతో దొరసాని ఫారెస్ట్‌ నుంచి పుట్టెనహల్లి సరస్సు వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.

ఉల్లిపాయల తొక్కలతో పేపర్‌ షీట్లు!

కరోనా కారణంగా పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. చాలామంది స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో వీడియో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేశారు. అయితే సామాజిక స్పృహ ఉన్న హర్ష మాత్రం ఓ మంచి పనికి పూనుకొంది. పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కాపాడుకోవాలంటే పచ్చదనంతోనే సాధ్యమని గట్టిగా నమ్ముతోందీ చిన్నారి. అదే సమయంలో పేపర్‌ తయారీ, ఇతర అవసరాల కోసం చెట్లను ఇష్టారీతిన నరకడం తనను బాగా కలచివేసింది. అందుకే లాక్‌డౌన్‌ సమయంలో ఉల్లిపాయల తొక్కలతో పేపర్‌ను తయారుచేసింది. మొదట విఫలమైనా ఎట్టకేలకు తను అనుకున్నది సాధించింది హర్ష. ఇందులో భాగంగా మొదట కేవలం 10 ఉల్లిపాయల తొక్కలను ఉపయోగించి 2-3 A4 పేపర్‌షీట్లను తయారుచేసింది. ఆ తర్వాత వెల్లుల్లి, టమాటాలు, బంగాళాదుంపలు, బీన్స్‌, ముల్లంగి తదితర కూరగాయల తొక్కలతోనూ పేపర్‌ తయారుచేయడంలో సఫలమైంది.

భూమాత బిడ్డలుగా అది మన బాధ్యత!

‘అందరూ ఏడాదికోసారి ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుకొంటారు. కానీ నేను మాత్రం రోజూ ఎర్త్‌ డేను జరుపుకొంటాను. ఎందుకంటే నేను భూమాతను తల్లిలా భావిస్తాను. మరి అలాంటిది నాకళ్ల ముందే పచ్చని ప్రకృతి నాశనమవుతోంటే నేను నిశ్శబ్దంగా చూస్తూ ఉండలేను. అందుకే పేపర్‌ కోసం అడవులను నిర్మూలించకుండా కూరగాయల తొక్కలతో కూడా పేపర్‌ను తయారుచేయవచ్చని నిరూపించాను. ఈ ప్రయత్నం వెనక మా అమ్మానాన్నల కృషి ఎంతో ఉంది. కేవలం నేనేక్కదాన్నే కాదు మనమంతా ఆ భూమాత బిడ్డలమే. ఆమెను రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అంటోందీ సూపర్‌ కిడ్‌.

పేపర్‌ బ్యాగ్స్ పంచుతూ!

కేవలం కూరగాయల తొక్కలే కాదు.. తన దగ్గరున్న పాత నోట్‌ పుస్తకాలనూ రీసైక్లింగ్‌ చేసి ఎకో ఫ్రెండ్లీ పేపర్‌షీట్లను తయారుచేస్తోంది హర్ష. అంతేకాదు వాటితో పేపర్‌ సంచులను తయారుచేసి సమీపంలోని దుకాణాదారులు, వ్యాపారులకు పంచుతోంది. ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానంలో వీటిని ఉపయోగించమని కోరుతోంది. అదేవిధంగా ఇంట్లోనే వీటిని తయారుచేసుకునేలా అవగాహన కల్పిస్తోంది.

‘రైజింగ్ స్టార్‌’ అంటూ!

తన రచనలతోనూ స్ఫూర్తి నింపుతోన్న హర్ష.. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అంశాలకు సంబంధించి ఇప్పటికే 5 పుస్తకాలు రాసింది. త్వరలో తను రాసిన మరో రెండు బుక్స్‌ కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఇక తన సామాజిక స్పృహకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకుందీ ఎకో వారియర్‌. ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా Earth.Org హర్షను ‘రైజింగ్‌ స్టార్’ బిరుదుతో గౌరవించింది. దీంతో పాటు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘వరల్డ్‌ రికార్డ్స్‌ ఇండియా’, ‘కర్ణాటక అఛీవర్స్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించింది.

ఈ భూమిని అందంగా చూడాలనుకుంటోంది!

ఇలా చిన్నతనంలోనే ప్రకృతి ప్రేమికురాలిగా మారిన హర్ష గురించి ఆమె తల్లి చైత్ర శ్రీ మాట్లాడుతూ.. ‘నా కూతురును చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకోవడమన్నా, నేర్చుకోవడమన్నా తనకెంతో ఆసక్తి. ఇందులో భాగంగానే ఇలా ప్రయోగాలు చేస్తుంటుంది. నా గారాల పట్టి ఈ భూగ్రహాన్ని అందంగా మార్చాలనుకుంటోంది. ఈ ప్రయత్నంలో మేం కూడా తనకు తోడ్పాటు అందిస్తున్నాం..’ అని చెప్పుకొచ్చింది.మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని