అమ్మే నాన్నైతే...! - ways to celebrate fathers day for single moms in telugu
close
Updated : 19/06/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మే నాన్నైతే...!

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం! పెంచి పెద్ద చేయడం, గౌరవ మర్యాదలు నేర్పించడం, విద్యాబుద్ధులు చెప్పడం, మంచి నడవడిక.. ఇలా అన్ని బాధ్యతల్నీ ఇద్దరూ కలిసి సమంగా పంచుకున్నప్పుడే పిల్లలకు-తల్లిదండ్రులకు మధ్య అనుబంధం బలపడుతుంది. అయితే పలు కారణాల వల్ల ఒంటరిగానే తమ పిల్లల్ని పెంచే తల్లులూ మన చుట్టూ ఎందరో! కేవలం తల్లి పాత్రలోనే కాకుండా.. తండ్రి బాధ్యతల్నీ వారు సమర్థంగా నిర్వర్తిస్తుంటారు. 
ఈ క్రమంలో- ఒంటరి తల్లులు, వారి పిల్లలు తమ మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ‘ఫాదర్స్ డే’ మరొక మంచి సందర్భం. 

అమ్మలు ఇలా..!

వారి మనసు తెలుసుకోండి..
తల్లి తన పిల్లలకు తండ్రి లేని లోటు ఎంతగా భర్తీ చేసినప్పటికీ ఏదో ఒక సందర్భంలో, ఎక్కడో ఒక చోట నాన్న లేని లోటు కొంతమంది పిల్లల మదిలో అలాగే ఉండిపోతుంది.. అది వేరే పిల్లల్ని చూసినప్పుడైనా కావచ్చు.. పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌లోనైనా కావచ్చు..! నిజానికి చిన్నారుల మదిలో నాటుకుపోయే ఇలాంటి భావాలు.. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచకుండా ఉండాలంటే.. సింగిల్‌ మదర్స్‌ వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అయితే అందుకు ఫాదర్స్‌ డేను కూడా వేదికగా చేసుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో అందరు పిల్లల్లాగా మీ చిన్నారుల జీవితంలో తండ్రి ఎందుకు లేడో వారికి వివరించాలి.. పరిస్థితుల్ని వారికి అర్థం చేయించాలి. మీ నుంచి వారు ఇంకా ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలి.. అప్పుడే ఇద్దరూ ఎలాంటి లోటూ లేకుండా సంతోషంగా ముందుకెళ్లగలుగుతారు.


మీ వాళ్లతో..!
తమ పిల్లల జీవితంలో తండ్రి పాత్రను పోషిస్తోన్న ఒంటరి తల్లులు.. తమ తండ్రులతో కలిసి కూడా ఫాదర్స్‌ డే జరుపుకోవచ్చు.. పైగా చిన్నారులకు వాళ్ల బామ్మ/అమ్మమ్మ-తాతయ్యలతో కలిసి సమయం గడపడం అంటే మహా సరదా! కాబట్టి ఈ ఫాదర్స్‌ డే రోజున మీరు మీ పిల్లల్ని తీసుకొని మీ అమ్మానాన్న దగ్గరికి వెళ్లచ్చు. ఒకవేళ వెళ్లడం వీలు కాకపోయినా వర్చువల్‌గానైనా వారితో వీడియో కాల్స్‌ మాట్లాడడం, విషెస్‌ చెప్పడం.. వంటివి చేయచ్చు. ఇలా చిన్నారులు వాళ్ల తాతయ్యతో సరదాగా గడిపే క్రమంలో తండ్రినీ మిస్సవుతున్నామన్న ఫీలింగ్‌ని మర్చిపోతారని రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఇటు మీరూ, అటు మీ పిల్లలూ పితృ దినోత్సవం సందర్భంగా ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకోవచ్చు.


మనసుకు నచ్చిన పని చేస్తూ..
భాగస్వామి నుంచి విడిపోయినా లేదంటే భర్త చనిపోయినా.. ఇలా కారణమేదైనా ఒంటరిగానే తమ పిల్లల బాధ్యతలు చూసుకునే మహిళలకు ఈ సందర్భంగా తమ భర్త గుర్తుకు రావడం పరిపాటే! అయితే ఈ క్రమంలో వారితో ఉన్న గత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బాధపడకుండా మిమ్మల్ని మీరు పాంపర్‌ చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ పిల్లలతో సమయం గడపడంతో పాటు మీకంటూ కాస్త టైమ్‌ కేటాయించుకొని నచ్చిన పనులు చేయచ్చు.. రిలాక్సవ్వచ్చు! తద్వారా పాత జ్ఞాపకాల వల్ల మనసు పాడవకుండా ఉంటుంది.. మీ పిల్లలతో సంతోషంగా గడిపినట్లూ ఉంటుంది.


పిల్లలు ఇలా..!
మదర్స్‌ డే అయినా, ఫాదర్స్‌ డే అయినా.. ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మకు, నాన్నకు ప్రత్యేక కానుకలివ్వడం, వారిని సర్‌ప్రైజ్‌ చేయడం మామూలే! అయితే అమ్మే నాన్నగా మారి అన్ని విషయాల్లోనూ ముందుకు నడిపిస్తోన్న ఆమెపై ప్రేమను చూపించడానికి, తండ్రిగా ఆమె నిర్వర్తిస్తోన్న బాధ్యతల్ని గుర్తు చేసుకోవడానికి ఫాదర్స్‌ డేని మించిన మంచి సందర్భం మరేముంటుంది చెప్పండి! అందుకే ఆ జ్ఞాపకాలన్నీ ఓసారి నెమరు వేసుకోండి..! వాటన్నింటినీ ఓ లేఖ రూపంలో రాయచ్చు.. లేదా కవితాత్మకంగా వర్ణించచ్చు.. ఇక వాటికి మీరిద్దరూ కలిసి దిగిన అందమైన ఫొటోల్ని కూడా జత చేస్తే.. మీరు రాసిన ప్రేమ లేఖకు తిరుగే ఉండదు. ఇక దీన్ని ఫాదర్స్‌ డే సందర్భంగా మీ అమ్మకు అందిస్తే.. ఆనందంతో ఆమె కళ్లు చెమర్చవంటే అతిశయోక్తి కాదు.
అలాగే మీ జీవితంలో తండ్రి పాత్రను పోషిస్తోన్న తల్లులకు నచ్చిన వంటకాలు చేసి స్వయంగా మీరే తినిపించచ్చు.. లేదంటే పిన్నులు, పెద్దమ్మలు, కజిన్స్.. అందరూ కలిసి ఇంట్లోనే ఓ చిన్న పాటి పాట్‌లక్‌ పార్టీలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా రోజుకంటే భిన్నంగా గడిచిన ఆ రోజు ఇటు మీకు, అటు మీ అమ్మకు ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య అనుబంధాన్నీ పెంచుతుంది.

సింగిల్‌ మదర్‌గా ఉంటూ పిల్లల జీవితంలో నాన్న పాత్ర పోషిస్తోన్న మహిళలు, వారి చిన్నారులు ఈ ఫాదర్స్‌ డేని జరుపుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో తెలుసుకున్నారు కదా! మరి, మీరు కూడా ఒకవేళ సింగిల్ మదర్ అయినట్లయితే లేదా మీ తల్లి కూడా మిమ్మల్ని నాన్న లేని లోటు తెలియకుండా పెంచుతున్నట్లయితే ఈ ఫాదర్స్‌ డేని మీరెలా జరుపుకొంటున్నారో మాకు తెలియజేయండి.. మీ ఇద్దరి మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలను అందరితో పంచుకోండి.


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని