Nagababu: ఆ కేసులన్నీ జగన్‌కు నెట్‌ ప్రాక్టీస్‌ లాంటివి!: నాగబాబు

దోచేయడం.. దాచేయడమే జగన్ అజెండా అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. జగన్ అవినీతి, అక్రమాలపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

Updated : 29 Apr 2024 20:02 IST

దోచేయడం.. దాచేయడమే జగన్ అజెండా అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. జగన్ అవినీతి, అక్రమాలపై ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ నుంచి నేర చరిత్ర మొదలుపెట్టిన జగన్.. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇన్ని రకాల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు. నేర మనస్తత్వం ఉన్న జగన్‌కు, ప్రజల మంచి కోరే పవన్ కల్యాణ్‌కు చాలా వ్యత్యాసం ఉందని వివరించారు. ఇన్ని ఘోరాలు చేసిన జగన్‌కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతిలోనే ఉందన్నారు. అందుకే ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. 

Tags :

మరిన్ని