సంబంధిత వార్తలు

నవరాత్రి బొమ్మలు!

నవరాత్రి బొమ్మలు! ఇంటికి అందం తెచ్చే బొమ్మల్ని ఇష్టపడనివారు ఎవరు? చెప్పాలంటే దసరా, సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు ఓ ముచ్చట. అలాంటి బొమ్మల తయారీలో కాత్యాయనిది ప్రత్యేక ముద్ర. ఆమె చేసే బొమ్మలు ఎన్నేళ్లైనా అలాగే ఉంటాయి. కేవలం చెక్క, వస్త్రంతో తయారుకావడమే వీటి ప్రత్యేకత. వాటికి తనదైన కళాసృజననూ, నేటితరాన్ని ఆకట్టుకునే నవ్యతని జతచేస్తున్నారు ఆమె. పూర్తిస్థాయి పర్యావరణహిత బొమ్మలివి. చెన్నైలోని నంగనల్లూరు ప్రాంతంలో తన ఇంట్లోనే వీటిని తయారు చేస్తున్నారు కాత్యాయని. సాధారణంగా బొమ్మల కొలువులనగానే పెళ్లి, పండుగల చుట్టే తిరుగుతుంటాయి. కానీ కాత్యాయని భారతదేశంలోని రాష్ట్రాల సంస్కృతులూ, జంతువులూ, గిరిజనులూ, తమిళ-తెలుగు జానపద ఆటపాటలూ ఇలా వైవిధ్యమైన అంశాలతో బొమ్మల్ని అందిస్తున్నారు. మే-నవంబర్‌ నెలలోనే ఈ బొమ్మలకు ఆదరణ ఎక్కువ. అమెరికాలోని ప్రవాస భారతీయులందరూ వేసవి సెలవుల కోసం ఇక్కడికొచ్చే నెలలవి. అలా వచ్చినవాళ్లే ఈ సీజన్‌లో ఈమె ప్రధాన వినియోగదారులు. ఇవిపోగా ఫేస్‌బుక్‌ అమ్మకాలూ ఉంటాయి. కేవలం నవరాత్రి బొమ్మలే కాకుండా.. మిగతా రోజుల్లో పెళ్లిళ్లకు సంబంధించిన బొమ్మలు విక్రయిస్తుంటారట. అంట నిశ్చితార్థం, పెళ్లి వంటి సమయంలో వేడుక కోసం అమర్చే అలంకరణ ప్రతిమలన్నమాట. వీటిని ఈమె దగ్గర్నుంచి ఎక్కువగా కొనేది హైదరాబాదీలే. అలా కొని.. అద్దెకు ఇచ్చేవాళ్ల సంఖ్యా తక్కువ కాదట. 2012లో సాయి కల్యాణ్‌ క్రియేషన్స్‌ని ప్రారంభించారామె. అంతకుముందు ఆమె ఓ బ్యాంకులో చీఫ్‌ మేనేజర్‌! రోజువారి ఒత్తిడీ, మూస జీవితం నుంచి దూరం కావాలని వీటి తయారీ ప్రారంభించారట. ఆమె అత్తయ్యే.. ఈ బొమ్మల తయారీకి స్ఫూర్తి. ఆమె చేయడం చూసే.. కాత్యాయని తానూ నేర్చుకుని ఇలా వ్యాపారం మొదలుపెట్టారు. వీటి తయారీతో ఏడాదికి ఆరులక్షల టర్నోవర్‌ సాధిస్తున్నారు.

తరువాయి

లోగోట్టు ఊరే గుర్తు

లోగోట్టు ఊరే గుర్తు కారు డిజైనే కాదు అత్యంత ఆకర్షణీయమైన లోగో ఉన్న కంపెనీల్లో మాసెరాటి ఒకటి అంటారు ఆటోమొబైల్‌ పండితులు. ప్రతి లోగో వెనక ఓ లోగుట్టు ఉన్నట్టే మాసెరాటికీ ఓ కథ ఉంది. ఈ కంపెనీ ఉపయోగించే ట్రిడెంట్‌ (త్రిశూల ఆకారం) గుర్తు బోలోగ్నా అనే పట్టణానికి సంప్రదాయ చిహ్నం. ఈ ఊరు మాసెరాటి కార్ల కంపెనీ వ్యవస్థాపకుడు ఆల్ఫీరీ మాసెరాటి సొంతూరు. ఆ అభిమానంతో కార్లు ఉత్పత్తి చేసే తొలి ప్లాంటు ఇక్కడే మొదలుపెట్టారు. తర్వాత అది మోడెనా నగరానికి మారింది. కాలక్రమేనా ఇదే లోగో కొద్దిపాటి మార్పులకు గురైంది ట్రిడెంట్‌తోపాటు వెనకాల నీలిరంగు బ్యాగ్రౌండ్‌ చేర్చడం మొదలుపెట్టి మరింత అందంగా తీర్చిదిద్దారు...

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్