Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'

మారుతున్న ఆహారపు అలవాట్లతో
‘వూబి’లోకి పోతున్నాం..
పెరుగుతున్న మాంసం వినియోగం
వర్ధమాన దేశాలకు
అగ్ర రాజ్యాలను మించిన ముప్పు
‘ఫ్యూచర్‌ డైట్స్‌’ నివేదిక వెల్లడి
ఆదాయం పెరిగిన కొద్దీ మనం తినే తిండిలో మార్పు వస్తుందా?
వినటానికి ఆశ్చర్యకరంగానే అనిపించినా... అవును, మార్పు వస్తోంది! పైగా ఈ మార్పు మంచికి కాదు.. చెడ్డకి! మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ ప్రజల ఆహారపుటలవాట్లు గణనీయంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆదాయాలు పెరిగే కొద్దీ.. ఆహారంలో మనం ఎప్పుడూ తినే ధాన్యం, గింజలు, కాయగూరల వాటా తగ్గిపోతూ... వాటి స్థానంలో మాంసం, కొవ్వు, చక్కెరలు ఎక్కువైపోతున్నాయి. మాంస వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఈ మార్పుల ప్రభావం అటు వ్యవసాయం మీదా, ఇటు మన ఆరోగ్యం మీదా కూడా పడటం తథ్యం. ముఖ్యంగా తిండి తీరు మారటం వల్ల నేడు మనలాంటి వర్థమాన దేశాల్లో వూబకాయం విపరీతంగా పెరుగుతోంది. అదీ, సంపన్న దేశాలను మించిపోయేంతగా! గత 30 ఏళ్లలో సంపన్న దేశాల్లో వూబకాయుల సంఖ్య కేవలం 1.7 రెట్లు పెరగ్గా... మన వర్థమాన దేశాల్లో ఏకంగా 3 రెట్లు పెరగటమే ఇందుకు నిదర్శనం. కొత్తగా వూబకాయం బారినపడే వారి సంఖ్య బ్రెజిల్‌, చైనా, భారత్‌ వంటి దేశాల్లోనే ఎక్కువగా ఉంటోంది.

లండన్‌కు చెందిన ‘ఓవర్‌సీస్‌ డెవెలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌’ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆహారపుటలవాట్లు, ఆహార వినియోగాల్లో వస్తున్న మార్పులను కూలంకషంగా అధ్యయనం చేసి ‘ఫ్యూచర్‌ డైట్స్‌’ పేరుతో ఒక నివేదిక వెలువరించింది. మాంస వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు వ్యవసాయం తీరు మారి.. ఆహార ధాన్యాల నుంచి దాణా ధాన్యాల వైపు మళ్లటం తథ్యమని నివేదిక విశ్లేషించటం విశేషం!

ముందంతా మాంసానిదే!
హార లభ్యత పెరగటం, ప్రజల ఆదాయాలు కూడా పెరగటంతో సంపన్న దేశాలతో పాటు మనలాంటి వర్థమాన దేశాల్లో కూడా గత 30 ఏళ్లలో వూబకాయం విపరీతంగా విస్తరించిపోయింది. ప్రపంచ వూబకాయుల సంఖ్య 1980లో 23 శాతం ఉండగా 2008 నాటికి ఇది 34 శాతానికి పెరిగింది, ఈ పెరుగుదల అధికంగా వర్థమాన దేశాల్లోనే ఉందని ‘ఫ్యూచర్‌ డైట్స్‌’ నివేదిక వెల్లడించింది. దీని ప్రభావాన్ని పరిశీలిస్తే- వూబకాయం, దానికి తోడు కొవ్వు-ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటుండటం వల్ల ప్రజల్లో మధుమేహం, హైబీపీ, క్యాన్సర్‌, గుండెపోటు, పక్షవాతం వంటి జీవనశైలికి సంబంధించిన జబ్బులు పెరిగిపోతున్నాయి. అయితే వర్థమాన దేశాల్లోని ప్రజలందరి పరిస్థితీ ఇలాగే లేదని, ఈ దేశాల్లో పోషకాహార లోపం కూడా ఎక్కువగా కనబడుతోందని నివేదిక స్పష్టం చేసింది. చాలా దేశాల్లో అసలు ఆహార లభ్యతేఏ తక్కువగా ఉంటోంది.
భవిష్యత్తు..?
అంచనాల ప్రకారం 2030 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు, 2050 నాటికి 900 కోట్లకు చేరుకుంటుంది. మాంస వినియోగం మరీ అంత ఎక్కువగా లేకపోతే అప్పటికి ఆహార లభ్యతకు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుత పోకడ చూస్తే మాంసాహార అవసరాలు బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల జంతువుల పెంపకానికి అవసరమయ్యే దాణా గింజలకు గిరాకీ మరింత పెరిగి.. వ్యవసాయం ఆయా దాణా పంటల దిశగా మళ్లే అవకాశం కనబడుతోంది. దీంతో తిండి గింజలు, ఆహార ధాన్యాల పంటలు తగ్గి.. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు ఆహారం మరింత భారంగా మారొచ్చని నివేదిక హెచ్చరించటం విశేషం.
ఆహార లభ్యత
త మూడు దశాబ్దాల్లో తలసరి ఆహార లభ్యత బాగా పెరిగింది. దీనివల్ల సంపన్నులు అసలు ధరల ప్రసక్తి అన్నదే లేకుండా తమకు ఏది ఇష్టమైతే దాన్ని ఎంచుకుంటున్నారు. ఆర్థిక అభివృద్ధి, ఆదాయాల పెరుగుదల, పట్టణీకరణ.. వీటన్నింటి ప్రభావంతో ప్రజలు సంప్రదాయంగా తాము తినే ధాన్యాలు, కూరగాయల నుంచి జంతు పదార్ధాలు (మాంసం, పాల ఉత్పత్తులు), కొవ్వులు, చక్కెరల వైపు ఎక్కువగా మళ్లుతున్నారు. గత 150 ఏళ్లలో చాలా సంపన్న దేశాల్లో ఆహార ధరలు గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు అమెరికానే తీసుకుంటే 1870లలో టన్ను గోధుమ ఖరీదు దాదాపు 600-800 డాలర్ల వరకూ ఉండగా 1999 నాటికి ఇది 100 డాలర్ల కంటే తక్కువకే వచ్చేసింది. 1957 నాటి ధరలతో పోలిస్తే జొన్న ఉత్పాదన వ్యయం 2001లో 25% కూడా లేదు. ఉత్పాదన వ్యయం తగ్గుతోంది, మరోవైపు ప్రజల్లో ఆర్థిక స్థోమతు పెరుగుతోంది. దీనివల్ల తమ ఆదాయంలో ఆహారం కోసం పెడుతున్న ఖర్చు శాతం బాగా తగ్గిపోతోంది. మన దేశంలో ఆహారం మీద పెడుతున్న ఖర్చు- వ్యక్తుల మొత్తం జీతంలో 25% కంటే తక్కువగా ఉంటోంది. సంపన్న దేశాల్లో ఇది 15% కూడా ఉండటం లేదు. అమెరికానే తీసుకుంటే గట్టిగా 7% కూడా ఉండటం లేదని నివేదిక గుర్తించింది. అదే పేద దేశాలను, పేద కుటుంబాలను చూస్తే- వాళ్ల ఆదాయాల్లో అధిక శాతం ఆహారం మీదే ఖర్చయిపోతోంది. ఆదాయం పెరిగిన కొద్దీ.. ఆహారం మీద పెట్టే ఖర్చు శాతం తగ్గిపోతుండటం గమనించాల్సిన అంశం. అలాగే ఆహారపు అలవాట్లు కూడా మారిపోతుంటాయి. ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ.. ఖరీదు తక్కువగా ఉండే వరి, గోధుమ, జొన్న, తదితరాల నుంచి ప్రజలు ధరలు ఎక్కువగా ఉండే మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, కొవ్వులు, స్వీట్లు, చక్కెరల వైపు ఎక్కువగా మళ్లుతుంటారు. వీటి ఖరీదు ఎక్కువే అయినా ప్రజలు వీటిని ‘ఎక్కువ రుచికరమైనవి’గా భావిస్తుంటారు. ఓ 30-40 ఏళ్ల గణాంకాలు చూస్తే- బ్రెజిల్‌, చైనాల్లో ఆదాయాలు పెరుగుతుంటే మాంస వినియోగమూ పెరుగుతోంది. మన దేశంలో కూడా గణనీయమైన పెరుగుదల ఉందిగానీ శాకాహారుల సంఖ్య కాస్త ఎక్కువ కావటం వల్ల విదేశాలతో పోలిస్తే తలసరి మాంస వినియోగం కొద్దిగా తక్కువగా ఉంది. బహుళజాతి సంస్థలు, మీడియా ప్రచారాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార వైవిధ్యం క్రమేపీ తగ్గుతూ కొవ్వు, ఉప్పులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల పదార్ధాల కోసం వెంపర్లాట పెరుగుతోందని నివేదిక వెల్లడించటం చెప్పుకోవాల్సిన విషయం. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు ఎంత వరకూ అందుబాటులో ఉంటోందన్నది కూడా నివేదిక పరిశీలించింది. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే రోజువారీ తినే సంప్రదాయ ఆహారానికి అయ్యే ఖర్చుకంటే 69% ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. సగటు ఆదాయం గలవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే వాళ్ల ఆదాయంలో 30% కంటే ఎక్కువగా తిండి మీద ఖర్చుపెట్టాల్సి వస్తోంది. మరీ అంత ఖరీదైన వాటికి పోకుండా.. ధరలు ఓ మోస్తరుగా ఉండే ఓట్స్‌, బీన్స్‌, క్యారెట్ల వంటివి తినేలా చూస్తే ఈ ఖరీదు ఓ 10% తగ్గుతోంది. మొత్తానికి ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అంతగా అందుబాటులో ఉండటం లేదనే చెప్పొచ్చు.
మార్పు మూలాలు
ప్రపంచీకరణ ఫలితంగా ఆహార వ్యాపారం ఖండాంతరాలకు విస్తరిస్తూ స్థానిక ఆహార పదార్ధాల కంటే దిగుమతి పదార్ధాల పట్ల మోజు పెరుగుతోంది. దీనివల్ల స్థానిక మార్కెట్లలో ఆహార పదార్ధాల ధరలు అస్తవ్యస్తమవుతున్నాయి. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతుండటం మూలంగా వర్థమాన దేశాల్లో బహుళజాతి కంపెనీలు కాలుమోపుతున్నాయి. వీటికి మీడియా ప్రచారం తోడై.. ప్రజల ఆహారం తీరు మారి, అనారోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం పెరుగుతోంది.
వైఖరుల మార్పు

ప్పటికీ చాలా దేశాల్లో ఆహార బాధ్యతలను స్త్రీలే మోస్తున్న నేపథ్యంలో... ఉద్యోగాల్లో స్త్రీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆహారం తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఉద్యోగాల ఒత్తిళ్ల వల్ల ఎక్కువసేపు ఉడికించాల్సిన వాటిని వదిలేసి వేగంగా పూర్తయ్యే నూడుల్స్‌, పాస్తా వంటివి ఎక్కువగా వండుతున్నారు. ఇటువంటి ‘రెడీమేడ్‌’పదార్ధాల్లో కొవ్వు, ఉప్పు, చక్కెరలు ఎక్కువగానే ఉంటాయి. లేదంటే తరచుగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నుంచి, హోటళ్ల నుంచి ఆహారం కొని తెచ్చుకోవటమూ పెరుగుతోంది.
సంస్కరణ సాధ్యమే
చాలా దేశాలు ఒక నిర్దుష్టమైన ‘ఆహార విధానాన్ని’ అనుసరించటం లేదు. ఆహారాన్ని వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశంగా వదిలేస్తున్నాయి. పైగా మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి వాటిని ముట్టుకోవటానికి, చక్కదిద్దటానికి నాయకత్వం కూడా వెనకాడుతోంది. దీనివల్ల ఆహార, వ్యవసాయ పరిశ్రమల్లో సంస్కరణలు కరవవుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నిస్తే మాత్రం మంచి ఫలితాలు కనబడటం తథ్యం. దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఆరోగ్యకరమైన సంప్రదాయ ఆహారానికి విస్తృత ప్రచారం కల్పించటం ఆరంభించింది. స్త్రీలకు, కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుకోవటమెలా? అన్నదానిపై శిక్షణ కూడా ఇస్తోంది. దీనికి తోడు ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారం పట్ల శ్రద్ధ పెరిగింది, దీనికి తోడు తలసరి పండ్ల వినియోగం, కూరగాయల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. చాలా దేశాల్లో పండ్ల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటోంది. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను కొనసాగించాలంటే ప్రజలు ఎక్కువ వెచ్చించాల్సి వస్తోంది. కాబట్టి ఆహారం విషయంలో విధానపరమైన మార్పు కోసం ప్రజలే డిమాండు చేసే రోజు ఎంతో దూరంలో లేదని నివేదిక అభిప్రాయపడింది.
కీలకాంశాలు
* ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మూడో వంతు.. అంటే దాదాపు 146 కోట్ల మంది వూబకాయులు లేదా అధిక బరువున్నవారే.
* 1980-2008ల మధ్య వర్థమాన దేశాల్లో వూబకాయుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. అంతకు ముందు 25 కోట్లు ఉన్న వూబకాయులు ఈ 30 ఏళ్లలో దాదాపు 90.4 కోట్లకు పెరిగిపోయింది. ఇదే సమయంలో సంపన్న, అగ్రదేశాల్లో మాత్రం వూబకాయుల సంఖ్య కేవలం 1.7 రెట్లు మాత్రమే పెరిగింది. దీనర్థం- వూబకాయం వర్థమాన దేశాల్లోనే అధికంగా విస్తరించిపోతోంది.
* వర్థమాన దేశాల్లో గత రెండు మూడు దశాబ్దాల్లో ప్రజల ఆదాయాలుపెరుగుతున్నాయి. ఇదే సమయంలో వారి ఆహారం తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఆదాయం పెరిగిన కొద్దీ జనం మాంసం, కొవ్వులు, స్వీట్ల వంటివాటివైపు ఎక్కువగా మళ్లుతున్నారు.
* భవిష్యత్తులో మాంసానికి గిరాకీ మరింతగా పెరుగుతుంది. దీనివల్ల మాంసం ఖరీదు మరింతగా పెరుగుతుంది. కానీ ఆశ్చర్యకరంగా ధాన్యం విషయంలో మాత్రం పెద్ద తేడాలేమీ రాకపోవచ్చు. కాబట్టి మున్ముందు వ్యవసాయంపై కొంత ప్రభావం ఉండచ్చుగానీ.. కొవ్వులు, మాంసాహారం ఎక్కువగా తినటం వల్ల ప్రజారోగ్యం బాగా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
* విధానపరంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించాలన్న ధోరణి ప్రభుత్వాల్లో, నాయకుల్లో ఎక్కడా కానరావటం లేదు. కానీ అటువంటి ప్రయత్నాలు జరిగిన చోట మాత్రం చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి.

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

సావిత్రి... టీజర్‌ విడుదల

నారా రోహిత్‌, నందిత జంటగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సావిత్రి చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో చిత్ర బృందం ఈ టీజర్‌ను విడుదల చేసింది. విజన్‌ ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net