మిస్టర్‌ ఆసియాగా బాలకృష్ణ

తాజావార్తలు

మిస్టర్‌ ఆసియాగా బాలకృష్ణ
ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరుకు చెందిన జి.బాలకృష్ణ అనే ట్యాంకర్‌ డ్రైవర్‌ ప్రతిష్ఠాత్మకమైన మిస్టర్‌ ఆసియా టైటిల్‌ సాధించాడు. ఇటీవల ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఐదో ఫిలి-ఏసియా బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అతడు కైవసం చేసుకున్నాడు. బెంగళూరు ఆర్నాల్డ్‌గా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆయనకు తల్లి పర్వతమ్మ, సోదరుడు రాజేష్‌ అండగా నిలిచారు. బాలకృష్ణ గతంలో కూడా జర్మనీలో జరిగిన పోటీలో అండర్‌-24 కేటగిరిలో మిస్టర్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యాడు. 2014లో ఏథెన్స్‌లో జరిగిన పోటీల్లో అండర్‌ -24కేటగిరిలో మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు.

బాలకృష్ణ ముంబయికి చెందిన సంగ్రామ్‌ చౌగ్లా, పంజాబ్‌కు చెందిన మునిష్‌ కుమార్‌లు వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం బాలకృష్ణ జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా, వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.