icon icon icon
icon icon icon

Gautam: మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్‌ గౌతమ్‌

ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్‌ అన్నారు.

Updated : 05 May 2024 15:52 IST

అమరావతి: ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న గౌతమ్‌.. అంబటి అరాచకాలను వివరిస్తూ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

‘‘అంబటి రాంబాబుకి అల్లుడిని కావడం నా దురదృష్టం. అతనికి వ్యక్తిత్వం లేదు. శవాలమీద పేలాలు ఏరుకునే రకం. రోజూ దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు.. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఎదురు కాకూడదని కోరుకుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెబుతున్నానంటే.. అతను పోటీ చేయబోతున్న పదవి అలాంటిది. ఎమ్మెల్యే అంటే.. మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలి. వంద శాతం లేకపోయినా కనీసం వాటిలో 0.001 శాతం కూడా లేని వ్యక్తి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు తెలియకుండానే చెడును ప్రోత్సహిస్తున్నట్టు. ఎవరైతే నిస్సిగ్గుగా.. పెద్ద గొంతేసుకుని అరిచి అబద్ధాన్ని నిజం చేయొచ్చనే భ్రమలో బతుకుతారో అలాంటి వాళ్లకు ఓటేస్తున్నట్టు లెక్క. ఎంత నీచమైన పనులు చేసినా సమాజంలో హుందాగా బతకవచ్చని అనుకునే వాళ్లను ప్రోత్సహించినట్టే అవుతుంది. అంబటి లాంటి వారిని ఎన్నుకుంటే రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. ప్రజలు గమనించి సరైన బాధ్యతతో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి’’ అని గౌతమ్‌ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img