Getup Srinu: రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్‌ శ్రీను.. ఏమన్నారంటే?

తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్‌ శ్రీను స్పందించారు.

Published : 05 May 2024 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటి, ఏపీ మంత్రి రోజా (Roja) ఇటీవల తనపై చేసిన కామెంట్లపై కమెడియన్‌ గెటప్‌ శ్రీను (Getup Srinu) స్పందించారు. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘రాజు యాదవ్‌’ (Raju Yadhav) సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘మెగా ఫ్యామిలీతో ఎన్ని సినిమాలు చేశానో మీకు తెలుసు. వెంకటేశ్‌, ఎన్టీఆర్‌, నానిలతోనూ నేను కలిసి నటించా. ఇతర హీరోల చిత్రాల్లో నాకు ఆఫర్లు రావట్లేదా?’’ అని అన్నారు.

‘‘కొన్ని సందర్భాల్లో ఇలాంటివి తప్పవు. ఏ మనిషీ అందరికీ నచ్చడు. పవన్‌ కల్యాణ్‌పై అభిమానం ఉంది కాబట్టే.. జనసేన తరఫున ప్రచారం చేశా. ఆయనకు లక్ష మెజారిటీ వస్తుంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజల స్పందన బాగుంది’’ అని అన్నారు. పార్టీ వర్గాలు ఆహ్వానిస్తే వెళ్లారా? స్వయంగా వెళ్లారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మా అంతట మేమే (సుడిగాలి సుధీర్‌, రాంప్రసాద్‌ తదితరులు) ఫోన్‌ చేసి మరీ ప్రచారానికి వెళ్లాం తప్ప వాళ్లు రమ్మని అడగలేదు’’ అని స్పష్టత ఇచ్చారు.

రోజా ఏమన్నారంటే?

శ్రీను, సుడిగాలి సుధీర్‌ కలిసి ఇటీవల ప్రచారానికి వెళ్లారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రోజా స్పందించారు. ‘‘వాళ్లెంతండీ? వాళ్ల ప్రాణమెంత? వీరితో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి గురించి ఆలోచించాలిగానీ వీరిని అనడం వేస్ట్‌. వీళ్లంతా చిన్న షోస్‌ చేసుకుంటూ.. చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. మీకు తెలియంది ఏముంది..? మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతో వారు ఆ కుటుంబంతో ఉన్నారు. ప్రేమతో ఎవరూ లేరు. నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కి సపోర్ట్‌ చేసినప్పుడు ఆయనెందుకు గెలవలేదు? ప్రేమ వేరు, భయం వేరు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని