వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!

నేను ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నా... నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నా స్నేహితులు వద్దన్నా వినకుండా అతన్ని నమ్మాను. అతనితో ట్రావెల్ చేసిన తర్వాత నాకు అతను మంచివాడు కాదని తెలిసింది. దాంతో నేను అతనిని వదిలేద్దాం అనుకున్నా.. కానీ అతను మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు.

Published : 06 May 2024 14:11 IST

నేను ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నా... నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నా స్నేహితులు వద్దన్నా వినకుండా అతన్ని నమ్మాను. అతనితో ట్రావెల్ చేసిన తర్వాత నాకు అతను మంచివాడు కాదని తెలిసింది. దాంతో నేను అతనిని వదిలేద్దాం అనుకున్నా.. కానీ అతను మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. నన్ను కష్టపడి చదివించారు. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. ఈ విషయాలన్నీ అతనికి తెలుసు. మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? - ఓ సోదరి

జ. మీరు ఒక్కరే బిడ్డ.. మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివించారు. అతను మంచివాడు అనుకొని అతనిని నమ్మి మీరు కొంతకాలం ప్రేమించారు. ఎప్పుడైతే మీ ఆలోచనలకు అతను అనుగుణంగా లేడని, అతని ప్రవర్తన గురించి వేరే విధమైన అవగాహన వచ్చిందో మీరు వద్దనుకుంటున్నారు. అలాగే ఈ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరని అంటున్నారు. అయితే ఇంట్లో తెలిసినంత మాత్రాన మొదట వారు బాధపడ్డా, ఎప్పటికీ మిమ్మల్ని రక్షించేది, మిమ్మల్ని అక్కున చేర్చుకొని తోడుగా నిలబడేది మీ తల్లిదండ్రులే అనే విషయాన్ని అర్ధం చేసుకోండి.

వివరంగా చెప్పండి...

ఈ విషయాన్ని నిదానంగా, విపులంగా అర్థం చేసుకునే రీతిలో మీ తల్లిదండ్రులకు చెప్పండి. ‘మీ ఇంట్లో చెప్తాను’ అన్న అతని బెదిరింపుల గురించి కూడా చెప్పండి. అవసరమైతే మీకు అండగా నిలబడగలిగిన వ్యక్తులు లేదా రక్షణ వ్యవస్థల సహాయం తీసుకోండి.

ముఖ్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వస్తాయనుకునే నష్టాల కంటే వాళ్లకు తెలియకపోవడం వల్ల కలిగే నష్టాలు, కష్టాలు ఎక్కువ అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే అతను ఈ విషయం మీ తల్లిదండ్రులకు చెప్తానని మిమ్మల్ని బెదిరిస్తున్నాడంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీ అంతట మీరే మీ తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా అతను బలహీనుడవుతాడు. అలాగే అతనంటే మీకు ఇష్టం లేదన్న విషయాన్ని, మీ వాళ్ల సహకారం మీకుందనేది అతనికి స్పష్టం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్