ప్రణాళిక ప్రకారమే నీట్‌: సుప్రీం

తాజావార్తలు

ప్రణాళిక ప్రకారమే నీట్‌: సుప్రీం
ప్లీని తిరస్కరించిన అపెక్స్‌కోర్టు
దిల్లీ: రెండు విడతల్లో జరగబోయే నీట్‌ పరీక్ష నిర్వహణలో ఎలాంటి మార్పులూ ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో తాము చెప్పిన మేరకే యధాతథంగా పరీక్ష జరుగుతుందని చెప్పింది. ఈ పరీక్షను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టులో కొందరు విద్యార్థులు ప్లీని దాఖలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర బోర్డుల కింద జరిగే ఈ పరీక్షకు సిలబస్‌ వేరేగా ఉండేదని, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తే సిలబస్‌ తేడాగా ఉంటుందని వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని శనివారం విచారించిన కోర్టు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. గురువారం తాము ఇచ్చిన తీర్పు మేరకే పరీక్ష జరుగుతుందని తేల్చి చెప్పింది. దీంతో మొదటి విడత నీట్‌ పరీక్ష ఆదివారం జరగనుంది.

2016-17 సంవత్సరానికి సంబంధించిన దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్యవిద్య ప్రవేశ పరీక్ష(నీట్‌) నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళికను సైతం కోర్టు ఆమోదించింది. నీట్‌1, నీట్‌2 పేర్లతో రెండు విడతల్లో ఈ పరీక్ష జరుగుతుందని చెప్పింది.

ప్రణాళిక ఇలా..
* నీట్‌1 పరీక్ష : మే 1న
* నీట్‌2 పరీక్ష : జూలై 24న
* రెండు పరీక్షల ఫలితాలు విడుదల : ఆగస్టు 17న
* కౌన్సిలింగ్‌ : సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేయాలి
* తరగతులు : అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కావాలి.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.