icon icon icon
icon icon icon

KCR: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్‌

కాంగ్రెస్‌, భాజపాకు ఓట్లు.. సీట్లు కావాలి కానీ, ప్రజా సమస్యలు పట్టవని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Published : 29 Apr 2024 21:54 IST

ఖమ్మం: కాంగ్రెస్‌, భాజపాకు ఓట్లు.. సీట్లు కావాలి కానీ, ప్రజా సమస్యలు పట్టవని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో భాజపాకు 200 సీట్లు కూడా రావని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రమంత్రి అవుతారని చెప్పారు.

‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం తెగేదాక కొట్లాడతాం. భారాస హయాంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు అడిగితే కస్సుమంటున్నారు. రూ.2500 ఇస్తామన్న కాంగ్రెస్‌ నేతల హామీ నెరవేరిందా? నిన్న భోజనం చేస్తుంటే కరెంట్‌ పోయిందని ట్వీట్‌ చేశా. దానికి అబద్ధాలు చెబుతున్నా అంటున్నారు. హామీలు నెరవేర్చమంటే నన్ను దూషిస్తున్నారు. తెలంగాణ సాధించిన నన్ను జైలులో వేస్తారా? జైలులో వేస్తా అంటే కేసీఆర్‌ భయపడతారా? లోక్‌సభ ఎన్నికలు అయ్యాక రేవంత్‌ భాజపాలోకి వెళ్తారని కొందరు అంటున్నారు. భాజపా నేతల వ్యాఖ్యలను రేవంత్‌ ఒక్కసారి కూడా ఖండించలేదు’’అని కేసీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img