Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 30 Apr 2024 00:39 IST

మేషం

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

వృషభం

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మిథునం

కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

కర్కాటకం

దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ,సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శనిధ్యానం శుభదాయకం.

సింహం

సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే బాగుంటుంది.

కన్య

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

తుల

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృశ్చికం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త. శ్రీసాయి నామాన్ని జపించాలి.

ధనుస్సు

బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ మంచిది.

మకరం

చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీరామ నామాన్ని జపించడం శుభప్రదం.

కుంభం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శుభప్రదం.

మీనం

శుభకాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శుభప్రదం. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని