ఎన్ని కుయుక్తులు పన్నినా దుగ్గిరాల ఎంపీపీ స్థానం తెదేపాదే

ప్రధానాంశాలు

ఎన్ని కుయుక్తులు పన్నినా దుగ్గిరాల ఎంపీపీ స్థానం తెదేపాదే

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కుట్రలను అడ్డుకుంటాం
తెదేపా నేత పోతినేని శ్రీనివాసరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా దుగ్గిరాల ఎంపీపీ స్థానాన్ని తెదేపానే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని, అధికారులను బెదిరించి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆళ్ల కుట్రలను అడ్డుకుంటామన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘దుగ్గిరాల మండలంలో తెదేపా 9 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. వైకాపా గెలిచింది 5 స్థానాలే.  అధికారాన్ని అడ్డుపెట్టుకుని రామకృష్ణారెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. తెదేపాకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థి జబీన్‌కు కుల ధ్రువపత్రం మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు. ఎంపీటీసీ సభ్యురాలు షేక్‌ జబీన్‌ మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో అందరికీ బీసీ(ఈ) కులధ్రువ పత్రాలుండగా.. నేను మాత్రం బీసీని కాదని ఎలా చెబుతారు? కుల ధ్రువపత్రం ఇవ్వకుండా తహసీల్దారుతో కలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డి కుట్ర చేశారు. ఎమ్మెల్యే ముమ్మాటికీ ముస్లిం ద్రోహే’ అని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని