Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. WhatsApp: ఒకేసారి 32 మందికి వీడియోకాల్‌.. డీఎన్‌డీ మోడ్‌, డాక్యుమెంట్‌ క్యాప్షన్.. ఇంకా!

పర్సనల్ లేదా ప్రొఫెషన్‌.. కమ్యూనికేషన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాట్సాప్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ ఫేస్‌, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో ఉచితంగా అందుబాటులో ఉండటం ఎక్కువ మందిని ఆకర్షించడానికి ప్రధాన కారణం. వాట్సాప్‌ ఇటీవలే మరికొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే డిలీట్ ఫర్‌ మీ టైమ్‌ లిమిట్‌, అన్‌రీడ్‌ చాట్ ఫిల్టర్, సైలెంట్ గ్రూప్‌ ఎగ్జిట్‌ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. మరి కొత్తగా రాబోయే ఫీచర్లతో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి రానున్నాయో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Team India: ‘#నెర్వస్‌19’... టీమ్‌ ఇండియా ‘భారీ’ కష్టం!

నెర్వస్‌ 90`s గురించి వినుంటారు. అంటే 90 నుంచి 100 పరుగుల మధ్యలో బ్యాటర్‌ ఒత్తిడికి గురై ఔటవ్వడం. కానీ భారత జట్టు ‘నెర్వస్‌ 19’తో ఇబ్బంది పడుతోంది. 19వ ఓవర్‌ బౌలింగ్‌ మనకు ఈ మధ్య అస్సలు అచ్చి రావడం లేదు. దాని సంగతేంటో ఓసారి చూసేయండి. టీమ్‌ ఇండియా (Team India) బౌలింగ్‌ బలహీనంగా ఉంది... గత కొంతకాలంగా ఈ మాట వింటూనే ఉన్నాం. ప్రత్యర్థులు మారినా.. మన బౌలర్లకు ఈ సమస్య మాత్రం పోవడం లేదు. టీ20ల్లో ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో మన బౌలర్లు స్ట్రీట్‌ క్రికెట్‌లో బౌలర్లలా మారిపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డీజీ హత్య కేసు.. ఇంటి సహాయకుడి డైరీలో ఏముందంటే..?

జమ్మూకశ్మీర్‌లో జైళ్ల శాఖ డీజీని  హత్య చేసినట్లు అనుమానిస్తోన్న ఇంటి సహాయకుడు డైరీని పోలీసులు గుర్తించారు. అందులో అతడు తన భవిష్యత్తు, మరణం గురించి రాసిన రాతలు అతడి ఆలోచనా ధోరణిని వెల్లడిచేస్తున్నాయి. ఆ మాటలను బట్టి అతడు డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి.   యాసిర్ అహ్మద్(36) గత ఆరునెలలుగా డీజీ హేమంత్ లోహియా ఇంట్లో పనిచేస్తున్నాడు. అతడు దుందుడుకుగా ప్రవర్తించేవాడని, డిప్రెషన్‌లో ఉన్నాడని విచారణ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా: జైరాం రమేశ్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. త్వరలో ఏపీలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో కర్నూలులో కాంగ్రెస్‌ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆదిపురుష్‌ టీజర్‌.. సినిమాతో మాకెలాంటి సంబంధం లేదు

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రతిష్ఠాత్మకంగా సిద్ధమైన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రానికి ఓం రౌత్‌ (Om Raut) దర్శకుడు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విడుదల చేసిన టీజర్‌కు మిశ్రమ స్పందనలు లభిస్తోన్న వేళ.. ఈ సినిమాతో తమకెలాంటి సంబంధం లేదని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా (NY VFXwalla) ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కోసం తాము పనిచేయలేదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సీఎన్‌ఎన్‌పై ట్రంప్‌ ₹3,867 కోట్ల పరువునష్టం దావా.. ఎందుకంటే?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై సీఎన్‌ఎన్‌ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నట్లుగా ఆరోపించిన ఆయన 475 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,867.71 కోట్లు) నష్టపరిహారాన్ని కోరారు. భవిష్యత్తులో తాను అధ్యక్ష బరిలో దిగే అవకాశాలను దెబ్బతీసేలా సీఎన్‌ఎన్‌ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫ్లోరిడా డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు. 2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ‘ది బిగ్‌ లై’ పేరిట సీఎన్‌ఎన్‌ నిర్వహించిన ప్రచారం.. తనకు నష్టం కలిగించిందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దనిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిషాసురమర్దని అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడు, లోకకంఠకుడైన మహిషాసురుడిని సంహరించి.. దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వలన సర్వదోషాలు తొలగిపోతాయని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రారంభమైన బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!

 ‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ (Bajaj Electronics)’ పేరిట ఎలక్ట్రానిక్స్‌ గృహోపకరణాల విక్రయశాలలను నిర్వహిస్తున్న ‘ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌’ ఐపీఓ (Electronics Mart IPO) మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 7వరకు ఇది కొనసాగనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా దాదాపు రూ.500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2021 సెప్టెంబరులో కంపెనీ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘భక్తితో వచ్చా.. కాంట్రవర్సీ కోసం కాదు’ : హేమ

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నటి హేమ (Hema) ఓ విలేకరి పట్ల అసహనానికి గురయ్యారు. తాను భక్తితో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చానని.. కాంట్రవర్సీల కోసం రాలేదంటూ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. సోమవారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హేమ మాట్లాడారు..‘‘దుర్గమ్మ అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని వార్తల్లో చూశా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 44 వేల కియా కరెన్స్‌ కార్ల రీకాల్‌.. ఎందుకో తెలుసా?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) తమ తాజా మోడల్‌ కరెన్స్‌ (Carens) కార్లను రీకాల్‌ (Recall) చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఎయిర్‌బ్యాగ్‌ నియంత్రణా సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నాయేమో తనిఖీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దాదాపు 44 వేల కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ ఏమైనా లోపాన్ని గుర్తిస్తే ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ సేవల్ని అందజేస్తామని చెప్పింది. దీనిపై తాము నేరుగా కరెన్స్‌ యజమానులనూ సంప్రదిస్తామని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు