close

వసుంధర

దాహార్తి తగ్గించే బార్లీ!

అధికవేడిని అదుపులో ఉంచే బార్లీకి తక్షణ శక్తిని అందించే గుణమూ ఎక్కువే. దాంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటంటే...!

బార్లీ గింజల్లో క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌ వంటి ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియల్ని చురుగ్గా మార్చి, అధికబరువుని అదుపులో ఉంచుతాయి.

రోజూ ఉదయాన్నే గోరువెచ్చని బార్లీ నీళ్లల్లో కాస్త తేనె కలిపి తీసుకుంటే జీర్ణాశయం శుభ్రపడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఉదర సమస్యలూ దరిచేరవు.

నీళ్లు సరిగా తాగకపోవడం, వేడి పదార్థాలు, మసాలా ఆహారం వంటివి తీసుకోవడం...ఇతరత్రా అనారోగ్య కారణాలవల్ల డీహైడ్రేషన్‌ ఎదురవుతుంది. ఇలాంటప్పుడు గ్లాసు గోరువెచ్చని బార్లీ నీళ్లల్లో కాస్త ఉప్పు, పంచదార కలిపి తాగితే మంచిది. అతిదాహం అదుపులోకి వస్తుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు