close

తెలంగాణ

పూర్తిస్థాయి ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఇన్‌ఛార్జి డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్‌.పి.ఠాకూర్‌ స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను ఇన్‌ఛార్జి డీజీపీగా నియమిస్తూ మే 30న రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అనంతరం పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం నలుగురు సీనియర్‌ అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపింది. దీనిపై ఆగస్టు 1న దిల్లీలో యూపీఎస్సీ ఎంపిక కమిటీ సమావేశమైంది.కొన్ని పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వాటి ఆధారంగా గౌతమ్‌ సవాంగ్‌ను రాష్ట్రప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేసుకుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు