బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 23:30 IST

హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై

చెన్నై: చెపాక్‌లో చెన్నై అదరగొట్టింది. హైదరాబాద్‌ను 78 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (98) చెలరేగి ఆడాడు. డారిల్‌ మిచెల్‌ (52), శివమ్‌ దూబె(39) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, నటరాజన్‌, ఉనద్కత్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.5 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌట్‌ అయింది. మార్‌క్రమ్‌ (32) టాప్‌ స్కోరర్‌. హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), నితీశ్‌ రెడ్డి (15), సమద్‌ (19) నిరాశ పరిచారు. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే 4, పతిరన 2, ముస్తాఫిజుర్‌ 2, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కోవికెట్‌ పడగొట్టారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని