IPPB recruitment: ఏడాదికి రూ.25లక్షల వరకు జీతం.. IPPBలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?

ఆకర్షణీయ వేతనంతో ఐపీపీబీలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

Published : 14 May 2024 20:06 IST

దిల్లీ: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒప్పంద ప్రాతిపదికన చేపట్టే ఈ 54 పోస్టులకు అర్హులైన వారు మే 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. బీటెక్‌/బీఎస్సీ/ఎంసీఏ తదితర అర్హతల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికైన వారికి హోదాను బట్టి గరిష్ఠంగా రూ.25లక్షల వరకు వార్షిక వేతనం చెల్లించనున్నారు. 

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం పోస్టులు 54 కాగా.. వీటిలో ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) 28 పోస్టులు;  ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) 21,  ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్): 5 పోస్టుల చొప్పున ఉన్నాయి. 
  • విద్యార్హతలు:  బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఆయా పోస్టులను బట్టి కనీసం ఏడాది నుంచి మూడేళ్ల వరకు పని అనుభవం తప్పనిసరి. 
  • వేతనం: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15,00,000; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 చొప్పున చెల్లించనున్నారు.
  • దరఖాస్తు రుసుం: రూ.750,  ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకైతే రూ.150 మాత్రమే.
  • ఎంపిక ప్రక్రియ : అసెస్‌మెంట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారు తొలుత దిల్లీ/ ముంబయి/ చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
  • అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 30 ఏళ్లు వయోపరిమితి కాగా, కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 40 ఏళ్లు, సీనియర్‌ కన్సల్టెంట్‌కు 22 నుంచి 45 ఏళ్లుగా ఉంది. 
  • ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, ఇతర అంశాలను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు