వారసులకు బాధ్యతలు అప్పగిద్దామా? - Pandemic influenced 84 pc of ultra wealthy Indians to reassess succession planning Survey
close

Published : 17/03/2021 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారసులకు బాధ్యతలు అప్పగిద్దామా?

 ప్రణాళికలను పునఃసమీక్షిస్తున్న సంపన్నులు
 కరోనా వల్లే: నైట్‌ ఫ్రాంక్‌

 

దిల్లీ: వారసులకు బాధ్యతలు అప్పగించే ప్రణాళికలపై భారత్‌లోని కుబేరుల్లో చాలామంది పునఃసమీక్ష జరుపుతున్నారని  నైట్‌ ఫ్రాంక్‌ యాటిట్యూడ్స్‌ సర్వే వెల్లడించింది. కొవిడ్‌-19 పరిణామాలే ఇందుకు కారణమని పేర్కొంది. 600 మందికి పైగా ప్రైవేట్‌ రంగ బ్యాంకర్లు, వెల్త్‌ అడ్వైజర్లు తమ అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపింది. వీళ్ల నిర్వహణలోని సంపద విలువ 3.3 లక్షల కోట్ల డాలర్లకు పైగానే ఉంటుంది. ఈ సర్వే ప్రకారం భారత్‌లో 84 శాతం మంది బాధ్యతల అప్పగింతపై మరోసారి సమీక్షిస్తుండగా, కెనడాలో 90 శాతం మంది పునఃసమీక్ష జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ బాధ్యతల అప్పగింతపై పునఃసమీక్షిస్తున్న అధిక సంపన్నులు 60 శాతమని సర్వే పేర్కొంది.

తమకున్న మూడు ప్రధాన ఆందోళనల్లో ‘తదుపరి తరానికి సంపద బదలాయించడం ఒకటి’గా భారత్‌కు చెందిన 30 శాతం మంది కుబేరులు వెల్లడించారు. మరో 16 శాతం మంది ఈ బాధ్యతను ఒక అద్భుత అవకాశంగా అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మూడు ఆందోళనల్లో ఇది ఒకటిగా 28 శాతం మంది, 2021లో ఇదో మంచి అవకాశమని 23 శాతం మంది తెలిపారు. ‘కరోనా మహమ్మారి పరిణామాలతో సంపద వృద్ధి, వారసులకు బాధ్యతల అప్పగింత నిర్ణయాలను పాతతరం పునఃసమీక్షించుకునేలా చేశాయి. సాంకేతికతపై పట్టు, వైవిధ్యభరిత ఆలోచనా విధానం కారణంగా యువతరం వాళ్ల సంపదను మరింతగా పెంచగలర’ని శిశిర్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. కొవిడ్‌-19 అనంతరం కొత్త పెట్టుబడులకు అవకాశాలు పెరగడంతో, సంపద సృష్టించేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు 89 శాతం మంది తెలిపారు.  దేశీయంగా ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు తమ సంపద సృష్టికి దోహదం చేస్తాయని 23 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...

సంపన్నుల ఓటు షేర్లకే

రూ.4.10 కోట్ల బెంట్లీ కారు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని