Stock market Closing Bell: గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ! - Stock markets Ends In Flat Note
close

Published : 27/09/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market Closing Bell: గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు జీవితకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. అయితే, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కాపేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అలా చివరి వరకూ ఊగిసలాట మధ్య కదలాడి ఆఖరుకు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు అలుముకొని సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.73.82 వద్ద ముగిసింది.

ఉదయం సెన్సెక్స్‌ 60,048.47 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,412.32 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 29.41 పాయింట్ల స్వల్ప లాభంతో 60,077.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.90 పాయింట్లు పెరిగి 17,855.10 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50 సూచీలో మారుతీ, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు రాణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, విప్రో, దివీస్‌ ల్యాబ్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఐషర్ మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ డీలాపడ్డాయి. రంగాలవారీగా చూస్తే.. ఆటో, స్థిరాస్తి, ఇంధన, ఆయిల్‌అండ్‌గ్యాస్‌ లాభపడ్డాయి. ఐటీ, టెక్‌, హెల్త్‌కేర్‌, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ ఒత్తిడి ఎదుర్కొన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని