Fire TV Stick 4K: వాయిస్‌ ఇన్‌పుట్‌ రిమోట్‌తో అమెజాన్‌ 4K ఫైర్‌స్టిక్‌.. ధరెంత?

Amazon Fire TV Stick: అమెజాన్ కొత్త ఫైర్‌ స్టిక్‌ను లాంచ్‌ చేసింది. 4కె సపోర్ట్‌తో ఇది వస్తోంది. 

Published : 10 May 2024 00:13 IST

Amazon Fire TV Stick 4K | ఇంటర్నెట్ డెస్క్‌: అమెజాన్ మరో జనరేషన్‌ ఫైర్‌స్టిక్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. తొలిసారిగా 4K (Amazon Fire TV Stick 4K) సపోర్ట్‌తో తీసుకొచ్చింది. పాత జనరేషన్లతో పోలిస్తే దీంట్లో కొన్ని ఫీచర్లను అదనంగా జోడించారు. సాధారణ ఎల్‌ఈడీ టీవీలను  స్మార్ట్‌ టీవీలుగా మార్చుకునేందుకు ఉపయోపడే ఈ ఫైర్‌ స్టిక్‌ ధరెంత? ఫీచర్లేంటో చూద్దాం..

అమెజాన్‌ తీసుకొచ్చిన కొత్త ఫైర్‌ స్టిక్‌ 4K మెటల్‌ బ్లాక్‌ రంగులో లభిస్తుంది. దీని ధరను రూ.5,999గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చు. మే 13 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌తో పాటు క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌, విజయ్ సేల్స్‌ వంటి ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఈ ఫైర్‌స్టిక్‌ లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది.

ఇక ఫైర్‌స్టిక్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 4K అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను ఈ ఫైర్‌ స్టిక్ ద్వారా వీక్షించొచ్చు. హెచ్‌డీఆర్‌ 10+కు కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్‌, డాల్మీ అట్మోస్‌ ఆడియో సపోర్ట్‌తో వస్తోంది. భారత్‌లో విక్రయిస్తున్న అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌లన్నింటికన్నా ఇదే పవర్‌ ఫుల్‌ అని కంపెనీ పేర్కొంటోంది. 

ఇందులో 1.7 GHz క్వాడ కోర్‌ ప్రాసెసర్‌ను అమర్చారు. వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది. ఫైర్‌స్టిక్‌తో పాటు అలెక్సా వాయిస్‌ సపోర్ట్‌తో రిమోట్‌ కూడా వస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, అమెజాన్‌ మ్యూజిక్‌ కోసం సెపరేట్‌ బటన్స్‌ ఇచ్చారు. మొత్తం 12వేల యాప్స్‌కు ఈ కొత్త ఫైర్‌ స్టిక్‌ సపోర్ట్‌ చేస్తుంది. అమెజాన్‌ యాప్‌ స్టోర్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యూట్యూబ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5, జియో సినిమా వంటి యాప్స్‌ను టీవీల్లో వీక్షించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు