జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

Published : 09 May 2024 14:16 IST

హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. అనంతరం తీర్పును న్యాయస్థానం ఈనెల 14కి వాయిదా వేసింది.

ఈనెల 17 నుంచి జూన్‌ 1 వరకు యూరప్‌ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. కుటుంబసభ్యులతో గడిపేందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని బుధవారం సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు విచారణ పూర్తిచేసి తీర్పును వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని