అంతర్జాతీయ మద్దతు.. ఫలితాల అండ
close

Published : 27/10/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్జాతీయ మద్దతు.. ఫలితాల అండ

సమీక్ష

వరుసగా రెండోరోజూ మార్కెట్లకు లాభాలే

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల అండతో సూచీలు వరుసగా రెండో రోజూ మెరిశాయి. మార్కెట్‌ లాభాల్లో సగానికి పైగా వాటా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుదే. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు బలపడి 74.96 వద్ద ముగియడం సెంటిమెంట్‌ను బలపరిచింది.

సెన్సెక్స్‌ ఉదయం 60,997.90 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అయితే అమ్మకాలతో నష్టాల్లోకి వెళ్లిన సూచీ.. ఒకదశలో 60,791.29 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సెన్సెక్స్‌, 61,497.71 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 383.21 పాయింట్ల లాభంతో  61,350.26 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 18,268.40 దగ్గర స్థిరపడింది.

* సెప్టెంబరు త్రైమాసికంలో లాభం 26% పెరగడంతో టెక్‌ మహీంద్రా షేరు ఇంట్రాడేలో 6.88% రాణించి రూ.1629.40 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.53% లాభంతో రూ.1562.90 వద్ద ముగిసింది.

* సియట్‌ షేరు 9.99% నష్టపోయి, రూ.1165 వద్ద కనిష్ఠాన్ని తాకింది. మళ్లీ కోలుకుని 0.14% లాభంతో రూ.1295.25 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 రాణించాయి. టాటా స్టీల్‌ 3.92%, టైటన్‌ 3.20%, నెస్లే 2.91%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.68%, కోటక్‌ బ్యాంక్‌ 2.48%, రిలయన్స్‌ 2.30% లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.92%, ఐసీఐసీఐ బ్యాంక్‌  1.43%, పవర్‌గ్రిడ్‌ 1.30%, హెచ్‌యూఎల్‌ 0.80% డీలాపడ్డాయి.

* జులై- సెప్టెంబరు ఫలితాలను పరిశీలించడానికి బుధవారం జరగాల్సిన బోర్డు సమావేశాన్ని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రద్దు చేసింది. సరిపడా కోరం లేకపోవడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.

ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా షేర్లు   నష్టాల్లో..: లఖ్‌నవూ ఫ్రాంచైజీ కొనుగోలు నేపథ్యంలో ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ కంపెనీ ఆర్‌పీఎస్‌జీ వెంచర్స్‌ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో 5.73% నష్టంతో రూ.797.25 వద్ద ముగిసింది. తొలుత బులిష్‌ ధోరణితో రూ.892కు చేరినా.. తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని