ఆ క్రెడిట్‌ అంతా నా భార్యదే..! - Imran Tahir says he was disappointed for not playing for Pakistan
close
Published : 23/07/2020 12:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ క్రెడిట్‌ అంతా నా భార్యదే..!

 పాకిస్థాన్‌లో ఆడే అవకాశం రాలేదు: ఇమ్రాన్‌ తాహిర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌కు చెందిన తాను ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడం నిరాశ కలిగించిందని దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అన్నాడు. బుధవారం దాయాది దేశానికి చెందిన జియో సూపర్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లాహోర్‌లో తాను క్రికెట్‌ ఆడేవాడినని, అక్కడ ఆడటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పాడు. ‘నా కెరీర్‌లో చాలా కాలం పాకిస్థాన్‌లోనే క్రికెట్‌ ఆడాను. కానీ ఆ దేశం నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశం రాలేదు. దాంతో తీవ్ర నిరాశ చెందా..’ అని తాహిర్‌ చెప్పుకొచ్చాడు. 

2005 వరకూ పాక్‌లోనే ఆడిన అతడు అక్కడే అండర్-19, పాకిస్థాన్‌ ఏ జట్ల తరఫున కూడా ఆడాడు. తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశం రాకపోవడంతో దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అక్కడి యువతినే పెళ్లాడడంతో నాలుగేళ్ల తర్వాత ప్రోటియాస్‌ జట్టుకు ఆడే అవకాశం లభించింది. ఈ విషయంపై స్పందించిన అతడు.. పాకిస్థాన్‌ను వీడటం కష్టంగా అనిపించిందని, అయినా దేవుడి దయ వల్ల దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం దక్కిందన్నాడు. ఈ విషయంలో ఆ క్రెడిట్‌ అంతా తన భార్య సుమయ్య దిల్బార్‌కే దక్కుతుందని చెప్పుకొచ్చాడు. అలా 2005లో దక్షిణాఫ్రికా వెళ్లిన ఇమ్రాన్‌ నాలుగేళ్ల తర్వాత 2009లో ఆ జట్టుకు ఎంపికయ్యాడు. దశాబ్దం పాటు అక్కడే ఆడిన అతడు గతేడాది వన్డే ప్రపంచ కప్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని