విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను - Is Saif Ali Khan backing out from publishing his autobiography
close
Updated : 21/11/2020 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను

ఆటోబయోగ్రఫీ నిలిపివేసే ఆలోచనలో స్టార్‌హీరో

ముంబయి: తన జీవితచరిత్రను అందరూ చదువుకునే విధంగా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తానని ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో ఆటోబయోగ్రఫీని రచించే ఉద్దేశం తనకి లేదని తాజాగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జాక్వెలిన్‌తో కలిసి ‘భూత్‌ పోలీస్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన ఆటోబయోగ్రఫీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘నా ఆటోబయోగ్రఫీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మొదట్లో భావించాను. నా జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను దానిలో పొందుపరచాలనుకున్నాను. ఆటోబయోగ్రఫీ విషయంలో నిజాయతీగా ఉండాలనేది నా ఉద్దేశం. దానివల్ల సమాజంలోని కొంతమంది ఇబ్బందిపడే అవకాశం ఉంది. బయోగ్రఫీ చదివాక పలువురు నాపై విమర్శనాస్త్రాలు సంధించవచ్చు. ప్రస్తుతానికి విమర్శలు ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా లేను. అంతేకాకుండా అన్ని విషయాలను నెగెటివ్‌గా తీసుకునే ఎంతోమందికి.. నా జీవితం గురించి తెలియజేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ భవిష్యత్తులో బయోగ్రఫీ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కూడా’ అని సైఫ్‌ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని