‘ఆది పురుష్‌’ఆరంభం! - adipurush motion capture begins prabhas to start shooting from february 2
close
Updated : 19/01/2021 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆది పురుష్‌’ఆరంభం!

ముంబయి: ప్రభాస్‌ శ్రీరాముని పాత్రలో ‘ఆది పురుష్‌’ పాన్‌ఇండియా 3డీ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైఫ్‌అలీఖాన్‌ రావణ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘మోషన్‌ క్యాప్చర్‌’పనిని ప్రారభించినట్టు ఆ చిత్ర దర్శకుడు ఓంరౌత్‌ మంగళవారం తెలిపారు. ‘మోషన్‌ క్యాప్చర్‌ మొదలైంది. ఆదిపురుష్‌ ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం’ అంటూ వీఎఫ్‌ఎక్స్‌ బృందంతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో విడుదల చేశారు. ఫిబ్రవరి 2న సినిమా ముహూర్త కార్యక్రమం ఉండనుందని వెల్లడించారు.

‘తానాజీ’వంటి చరిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఓంరౌత్‌. ఇప్పుడు బాహుబలి ప్రభాస్‌తో రామాయణం వంటి పౌరాణిక చిత్రాన్ని చేయనుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెట్రోపిల్స్‌, టి-సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆదిపురుష్‌’ను 2022 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’చిత్రీకరణలో బిజీగా ఉంటూనే ‘కేజీఎఫ్‌’ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్‌’సినిమాను ప్రారంభించారు.

ఇవీ చదవండి!

వస్తోందండి నవ్వుల బండి.. నవ్వేందుకు సిద్ధంకండి

తాగడానికి తగని సమయముంటదా..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని