గే లాయర్‌ పదోన్నతిపై కేంద్రానికి సీజేఐ లేఖ - cji writes to center over the elevation of gay lawyer as judge
close
Published : 31/03/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గే లాయర్‌ పదోన్నతిపై కేంద్రానికి సీజేఐ లేఖ

దిల్లీ: స్వలింగ సంపర్కుడైన సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కృపాల్‌ పదోన్నతి అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం. లాయర్‌ కృపాల్‌పై నాలుగు వారాల్లో అదనపు సమాచారం ఇవ్వాలని, అప్పుడే ఆయన పదోన్నతిపై త్వరగా నిర్ణయం తీసుకోగలమని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు రాసిన లేఖలో జస్టిస్‌ బోబ్డే పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెండు వారాల కిందటే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

మార్చి 2న సుప్రీంకోర్టు కొలీజియం జరిపిన సమావేశంలో న్యాయవాది కృపాల్‌పై చర్చ జరిగింది. ఆయనకు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని దిల్లీ హైకోర్టు చేసిన ప్రతిపాదనలపై కొలీజియం సభ్యులు జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే కృపాల్‌పై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు తీసుకోవాలని భావించిన కొలీజియం.. ఆయన పదోన్నతిపై నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసింది. 

లాయర్‌ కృపాల్‌ను న్యాయమూర్తిగా నియమించే ప్రతిపాదనలపై నిర్ణయం వాయిదా పడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. నిజానికి ఆయన పేరును దిల్లీ హైకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ 2017 అక్టోబరులోనే సిఫార్సులు పంపింది. అయితే కొన్ని కారణాలతో అప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆ తర్వాత 2018-19 మద్య రెండు సార్లు కృపాల్‌ పదోన్నతి అంశం చర్చకు రాగా.. ఆయన భాగస్వామి కారణంగా మళ్లీ వాయిదా వేశారు. కృపాల్ భాగస్వామి స్విట్జర్లాండ్‌కు చెందిన వ్యక్తి కావడంతో భద్రతాపరమైన ముప్పు ఉండొచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో తమ నివేదికలో పేర్కొంది. అయితే తన లైంగికత కారణంగానే పదోన్నతి కల్పించడం లేదంటూ కృపాల్‌ ఆరోపిస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని