‘అనుకోని అతిథి’ టైటిల్‌ సాంగ్ పుల్‌ వీడియో   - full video title song from anukoni athidi sai pallavi fahad faasil
close
Published : 04/06/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అనుకోని అతిథి’ టైటిల్‌ సాంగ్ పుల్‌ వీడియో  

ఇంటర్నెట్‌ డెస్క్: ఫహ‌ద్ ఫాజిల్, సాయి ప‌ల్ల‌వి కలిసి న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’. తెలుగులో ‘అనుకోని అతిథి’గా వచ్చింది. వివేక్‌ దర్శకత్వ వహించారు. 2019లో థియేట‌ర్ల‌లో విడుదలై ప్రేక్ష‌కుల్ని మెప్పించిన ఈ సినిమా డిజిట‌ల్ మాధ్య‌మైన ‘ఆహా’ ఓటీటీ వేదికగా మే 28న విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ సినిమాకి సంబంధిన టైటిల్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియో యూట్యూబ్‌లో వచ్చేసింది. టైటిల్‌ సాంగ్‌కి చరణ్‌ అర్జున్‌, మామిడికాల్వ మధు సాహిత్యం అందించగా మౌనికా రెడ్డి ఆలపించారు. పీఎస్‌ జయహరి సంగీతం స్వరాలు సమకూర్చారు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతాన్ని అందించారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యం తెరకెక్కిన ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించగా రెంజీ పానికర్, శాంతి కృష్ణ, సురభి, సుదేవ్ నాయర్, నందు, లీనా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని