అల్లు అర్జున్‌ 374వ ప్రయత్నం కూడా విఫలం..!
close
Published : 12/06/2020 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు అర్జున్‌ 374వ ప్రయత్నం కూడా విఫలం..!

అర్హ వీడియో వైరల్‌.. నేనొస్తున్నా అంటోన్న పాయల్‌

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఎన్ని సార్లు అడిగినా.. ఆయన ముద్దుల కుమార్తె అర్హ ఒకే సమాధానం చెబుతోంది. ఆయన చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోనని అంటోంది. 2019 ఫిబ్రవరి 8న బన్నీ ఈ వీడియోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘నేను నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోను..’ అని అప్పట్లో చిన్నారి చెప్పింది. కాగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు బన్నీ చాలా సార్లు ఇదే ప్రశ్న అడిగారట. కానీ అర్హ మాత్రం ‘నో’ అనే చెబుతోందట. ఈ విషయాన్ని తెలుపుతూ బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్ వీడియో షేర్‌ చేశారు. ‘అర్హ.. నా బుజ్జితల్లి.. నా బంగారు తల్లి.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగిన వెంటనే.. ‘ఊహు.. చేసుకోను..’ అంటూ చేతిలో ఉన్న వస్తువును అక్కడే పెట్టేసి అర్హ లోపలికి పరుగులు తీసింది. బన్నీ ‘ఏయ్‌.. నిన్ను..’ అని కేక పెట్టారు. ఇది తన 374వ ప్రయత్నమని చెప్పారు. తండ్రీకూతుళ్ల మధ్య ప్రేమను తెలిపే ఈ సరదా వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదే సందర్భంగా మన తారలు ఏం చేస్తున్నారో, సోషల్‌మీడియా ఖాతాల్లో ఏం షేర్‌ చేశారో చూద్దాం. ‘జ్యోతిలక్ష్మి’ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నటి ఛార్మి, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. నిర్మాతగా తన కెరీర్‌ ఇక్కడి నుంచే ప్రారంభమైందని ఛార్మి అన్నారు. ఇదో అద్భుతమైన ప్రయాణమని పేర్కొన్నారు.

మరోపక్క నటి జెనీలియా మట్టిలో గెంతులేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. సోనమ్‌ కపూర్‌ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సాయిపల్లవి తన సోదరితో కలిసి ఊటీ వెళ్లినట్లు తెలుస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని