‘డాంగ్‌.. డాంగ్‌..’ అదరగొట్టిన తమన్నా!
close
Updated : 05/01/2020 21:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డాంగ్‌.. డాంగ్‌..’ అదరగొట్టిన తమన్నా!

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘డాంగ్.. డాంగ్‌..’ అంటూ పాటకు తమన్నా లైవ్‌ డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసే అవకాశం ఇచ్చిన మహేశ్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు అనిల్‌ చాలా చక్కని వ్యక్తి అని అన్నారు. ఆయన టేకింగ్‌ బాగుంటుందని తెలిపారు. 

నాది గమ్మతైన వేషం

అంతకుముందు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సంక్రాంతికి ఎవరూ మహేశ్‌బాబుకు సరిరారని అన్నారు. నా సోదరుడు అనిల్ రావిపూడి గమ్మత్తైన వేషం ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడి, నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజు గార్లకు ధన్యవాదాలు’ అని అన్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని