మాళవిక ప్రేమలో రాజ్‌తరుణ్‌..! 
close
Published : 21/02/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాళవిక ప్రేమలో రాజ్‌తరుణ్‌..! 

వరుణ్‌తేజ్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: ‘కుమారి 21ఎఫ్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు రాజ్‌తరుణ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఓరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌కు జంటగా మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ నటిస్తున్నారు. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఈ సినిమా నుంచి ‘కురిసేనా, కురిసేనా’ అంటూ సాగే ఓ మెలోడి పాటను వరుణ్‌తేజ్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన వరుణ్‌ ‘ఓరేయ్‌ బుజ్జిగా’ చిత్రబృందానికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.

అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని మొదటిపాట ‘కురిసేనా కురిసేనా’ను అర్మాన్‌ మాలిక్‌, మేఘన ఆలపించారు. రాజ్‌తరుణ్‌-మాళవిక మధ్య ప్రేమను తెలియజేస్తూ ఈ పాటను చిత్రీకరించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని