Samsung Power Banks: శామ్‌సంగ్‌ కొత్త పవర్‌బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్‌లకు ఛార్జింగ్‌

Samsung Power Banks: 10,000mAh, 20,000mAh సామర్థ్యంతో భారత్‌లో శామ్‌సంగ్‌ రెండు కొత్త పవర్‌బ్యాంకులను విడుదల చేసింది.

Published : 07 May 2024 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మార్కెట్‌లో శామ్‌సంగ్‌ (Samsung) రెండు కొత్త పవర్‌ బ్యాంకులను విడుదల చేసింది. ఒకటి 10,000mAh, మరొకటి 20,000mAh సామర్థ్యంతో వస్తోంది. రెండూ లేత గోధుమ రంగులో అందుబాటులో ఉన్నాయి. వీటిని (Samsung Power Banks) శామ్‌సంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో కొనుగోలు చేయొచ్చు.

వైర్‌లెస్‌ సపోర్ట్‌తో 10,000mAh..

10,000mAh పవర్‌ బ్యాంక్‌ గరిష్ఠ ఔట్‌పుట్‌ 25 వాట్లు. దీని ధర రూ.3,499. యూఎస్‌బీ-సి పోర్టులతో రెండు డివైజ్‌లను ఒకేసారి ఛార్జ్‌ చేయొచ్చు. అదనంగా మూడో పరికరాన్ని ఛార్జ్‌ చేయడానికి వైర్‌లెస్‌ ఆప్షన్‌ ఉంది. మూడు ఒకేసారి ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 7.5 వాట్ల ఔట్‌పుట్‌ మాత్రమే లభిస్తుంది. ఒక పరికరాన్ని కనెక్ట్‌ చేసినప్పుడు మాత్రమే 25 వాట్ల ఔట్‌పుట్‌ను పొందొచ్చు. కేవలం రెండింటినీ మాత్రమే ఛార్జ్‌ చేస్తే ఒక్కో డివైజ్‌కు 10 వాట్ల ఔట్‌పుట్‌ లభిస్తుంది. పవర్‌ బ్యాంక్‌ మాత్రం 25 వాట్ల ఔట్‌పుట్‌తో ఛార్జ్‌ అవుతుంది. దీని పరిమాణం 148 x 71 x 16.4 మిల్లీమీటర్లు. బరువు 222 గ్రాములు.

మూడు సి-పోర్టులతో 20,000mAh..

20,000mAh పవర్‌ బ్యాంక్‌లో మాత్రం వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ లేదు. దీని ధర రూ.4,299. ఒక్క డివైజ్‌ను మాత్రమే ఛార్జ్ చేస్తే 45 వాట్ల ఔట్‌పుట్‌ను అందిస్తుంది. మూడు యూఎస్‌బీ-సి పోర్టులు ఉన్నాయి. మూడు డివైజ్‌లను ఒకేసారి ఛార్జ్‌ చేస్తే ఔట్‌పుట్‌ 15 వాట్లకు పడిపోతుంది. పవర్‌ బ్యాంక్‌ మాత్రం 45 వాట్ల ఔట్‌పుట్‌తో ఛార్జ్‌ అవుతుంది. దీని బరువు 402 గ్రాములు. పరిమాణం 152 x 76 x 25.5 మిల్లీమీటర్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు