‘నా మైండ్‌ నుంచి ఆ పాటను తొలగించలేకపోతున్నా’
close
Published : 22/01/2020 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నా మైండ్‌ నుంచి ఆ పాటను తొలగించలేకపోతున్నా’

‘సామజవరగమన’ పాటకు కేటీఆర్‌ ప్రశంసలు

హైదరాబాద్‌: సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పేరు పొందిన ‘సామజవరగమన’ పాటను తన మైండ్‌లో నుంచి తొలగించలేకపోతున్నా అని కేటీఆర్‌ అంటున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సినిమా విడుదలకంటే నాలుగు నెలలు ముందుగానే విడుదలైన ‘సామజనవరగమన’ పాటకు చిన్నపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఫిదా అయ్యారు. అందుకే విడుదలైన నాటి నుంచి నేటి వరకూ 100 కోట్లకు పైగా రియల్‌టైమ్‌ వ్యూస్‌తో య్యూటూబ్‌లో దూసుకుపోతోంది. 

ఇదిలా ఉండగా తాజాగా తమన్‌ స్వరాలు అందించిన ఈ పాటకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభిమాని అయ్యారు. తమన్‌ అందించిన సంగీతం చాలా అద్భుతంగా ఉందని పేర్కొంటూ ట్విటర్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘స్విస్‌ కాలమానం ప్రకారం ఇప్పుడు తెల్లవారుజామున 3.30 గంటలు అవుతుంది. నా ప్లేలిస్ట్‌లోని ‘సామజవరగమన’ పాట నాకు కంపెనీ ఇస్తుంది. చాలా అద్భుతమైన పాట. తమన్‌ నువ్వు అందించిన సంగీతం చాలా బాగుంది. నా మైండ్‌ నుంచి ఈ పాటను తొలగించలేకపోతున్నా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు కేటీఆర్‌ ట్వీట్‌ చూసిన తమన్‌ చాలా సంతోషించారు. కేటీఆర్‌ ట్వీట్‌ను రిట్వీట్‌ చేశారు.

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని