త్రిష తప్పుకోవడంపై చిరు కామెంట్‌
close
Published : 10/04/2020 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్రిష తప్పుకోవడంపై చిరు కామెంట్‌

‘నేను షాక్‌ అయ్యా..!’

హైదరాబాద్‌: కథానాయిక త్రిషతో చిత్ర బృందంలో ఎవరికీ భేదాభిప్రాయాలూ లేవని అగ్ర కథానాయకుడు చిరంజీవి తెలిపారు. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా ముందు త్రిషను తీసుకున్నారు. ఆమె కొన్ని రోజులు షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. అయితే క్రియేటివ్‌ విషయంలో భిన్నాభిప్రాయాల వల్ల ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు త్రిష ట్వీట్‌ చేసి, అందరికీ షాక్‌ ఇచ్చారు. ఆపై ఆమె స్థానంలో కథానాయిక కాజల్‌ను తీసుకున్నారు.

అయితే త్రిష ప్రాజెక్టు నుంచి వైదొలగడం గురించి చిరు తాజాగా స్పందించారు. ఆమె తప్పుకుందని తెలిసి షాక్‌కు గురైనట్లు చెప్పారు.  ‘త్రిషతో ఏదైనా సమస్య ఉందా? అని నా బృందాన్ని అడిగాను. నా కుమార్తె సుస్మితా.. త్రిష కాస్ట్యూమ్స్‌ కూడా సిద్ధం చేసింది. ఆమె సినిమా నుంచి తప్పుకుందన్న వార్త తెలిసి షాక్‌ అయ్యా. ఆ తర్వాత.. ఆమె మణిరత్నం ప్రాజెక్టుకు సంతకం చేశారని, ఆ సినిమాకు అధికంగా డేట్స్‌ ఇచ్చారని నాకు తెలిసింది. క్రియేటివిటీ విషయంలో త్రిషతో మా టీంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయాలూ లేవు’ అని పేర్కొన్నారు.

త్రిష చేతిలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘పరమపదం విలయాట్టు’, ‘రాంగీ’, ‘రామ్‌’, ‘గర్జనై’ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో త్రిషతోపాటు విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని