8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్‌పుర్‌ తల్లీకొడుకులు

రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్‌లాల్‌ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు.

Published : 09 May 2024 06:03 IST

ఈటీవీ భారత్‌: రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్‌లాల్‌ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. ప్రపంచ రికార్డులో నమోదుకు వీరు ఈ ప్రయత్నం చేశారు. మోహన్‌లాల్‌ మాట్లాడుతూ..‘‘ఏళ్లతరబడి ఇదే పనిలో ఉన్నాం. ఏదైనా భిన్నంగా చేయాలని ఆలోచించి అతిపెద్ద సైజులో ఈ జోళ్లు కుట్టాం. వీటి తయారీకి రూ.1.5 లక్షల ఖర్చయింది. చిన్నప్పటి నుంచీ జోళ్ల తయారీలో అమ్మ చేసే ఎంబ్రాయిడరీ పని చూస్తూ పెరిగా’’ అని తెలిపారు. ఈ కళలో నిపుణురాలైన చంద్రాదేవి గతంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకొన్నారు. నిఫ్ట్‌, ఎఫ్‌డీడీఐ వంటి వృత్తివిద్యా సంస్థల ఆహ్వానంపై ఆమె విద్యార్థులకు మెలకువలు బోధించారు. మలేసియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు భారత్‌ తరఫున పాత్రినిధ్యం  వహించారు. దిల్లీలో జరిగిన మిస్‌వరల్డ్‌ పోటీలకు మోడల్స్‌ ధరించేందుకుగాను జోధ్‌పుర్‌ జోళ్లు వీరి దుకాణం నుంచే వెళ్లాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని