అదే నా అధికారిక పేజీ: నివేదా పేతురాజు
close
Published : 04/05/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే నా అధికారిక పేజీ: నివేదా పేతురాజు

మిగిలిన వాటిని నమ్మకండి

హైదరాబాద్‌: తమ అభిమాన నటీనటుల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోడానికి చాలామంది అభిమానులు సోషల్‌మీడియా బాట పడతారు. అయితే కొన్నిసార్లు సోషల్‌మీడియాలో నటీనటులకు సంబంధించి నకిలీ అకౌంట్లు ఉండడంతో చాలామంది బోల్తాపడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నివేదా పేతురాజు తన ట్విటర్‌ ఖాతా గురించి అభిమానులకు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్‌ చేశారు. @Nivetha_Tweets అనేది మాత్రమే తన అధికారిక ట్విటర్‌ ఖాతా అని వెల్లడించారు. తన పేరుతో ఉన్న మిగిలిన ఖాతాలను నమ్మవద్దని సూచించారు.

‘హాయ్‌ ఆల్‌, ట్విటర్‌లో ఎన్నో నకిలీ ఖాతాలు ఉంటున్నాయి. నాకు ట్విటర్‌ ఖాతా ఉంది. @Nivetha_Tweets అనేది మాత్రమే నా అధికారిక ట్విటర్‌ పేజీ. నకిలీ ఖాతాలను ప్రోత్సహించకండి. నా ట్విటర్‌ పేజీకి కూడా త్వరలోనే అధికారిక గుర్తింపు పొందడం కోసం చూస్తున్నాను. థ్యాంక్యూ’ అని నివేదా పేతురాజు తెలిపారు.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో నివేదా సందడి చేశారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నివేదా నందిని అనే పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రెడ్‌’ సినిమాలో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నివేదా.. ఇన్‌స్పెక్టర్‌ యామినిగా మెప్పించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని