Corona: లాక్‌డౌన్‌ను పొడిగించలేం: స్టాలిన్‌ - lockdown cannot be extended again says stallin
close
Published : 01/06/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: లాక్‌డౌన్‌ను పొడిగించలేం: స్టాలిన్‌

చెన్నై: కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ..  పదేపదే లాక్‌డౌన్‌ను పొడిగించలేమని, త్వరలోనే దీనికి ముగింపు పలకాలని యోచిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఈమేరకు ట్విటర్‌లో ఆయన ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గత మూడు వారాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్‌కు, ఆస్పత్రుల్లో పడకలకు కొరత లేదని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

‘‘ఆస్పత్రుల్లో చాలా బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. మన వల్ల ఇతరులకు మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూడాలి’’ అని స్టాలిన్‌ వీడియోలో తెలిపారు. తమిళనాడులో మే 10 నుంచి లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అయినప్పటికీ పాజివ్‌ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో మే 24 నుంచి రాష్ట్రం ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. ఇది జూన్‌ 7 వరకు అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ పొడించలేమని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. కొవిడ్-19 సహాయ పథకం కింద రూ.4000 సాయం ప్రకటించామని, మొదటి విడతగా రూ. 2000 ఇప్పటికే విడుదల చేశామని స్టాలిన్‌ వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని