ఆసక్తి రేపుతోన్న ‘పవర్‌ ప్లే’ట్రైలర్‌! - power play trailer
close
Published : 01/03/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసక్తి రేపుతోన్న ‘పవర్‌ ప్లే’ట్రైలర్‌!

హైదరాబాద్‌: రాజ్‌తరుణ్‌, హేమల్‌ హీరోహీరోయిన్లుగా విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో ‘పవర్‌ ప్లే’చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పూర్తి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కగా, సామాన్యుడైన హీరో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చిక్కుకొని వాటి నుంచి ఎలా బయట పడ్డాడు, తనపై వచ్చిన ఆరోపణలకు ఎలా చెక్‌ పెట్టాడనే కథాంశంతో చిత్రం ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. ‘ఎవడ్రా నువ్వు.. నన్ను రోడ్డు మీదకు లాగేశావ్‌’ అంటూ రాజ్‌తరుణ్‌ చెప్పే డైలాగ్‌తో కథలో ఎన్ని మలుపులు ఉంటాయో అర్థమౌతోంది. నటి పూర్ణ ఒక కీలకపాత్రలో కనిపిస్తుండటం విశేషం. సురేష్‌ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. వనమాలి ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని