Sai kumar: ‘పోలీస్‌స్టోరీ’ తర్వాత నాకు పేరు తెచ్చిన చిత్రమిదే! - sai kumar about sr kalyana mandapam ott release
close
Published : 29/08/2021 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sai kumar: ‘పోలీస్‌స్టోరీ’ తర్వాత నాకు పేరు తెచ్చిన చిత్రమిదే!

హైదరాబాద్‌: ‘పోలీస్‌స్టోరీ’ తర్వాత తనకు అంతటి పేరు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రం తీసుకొచ్చిందని నటుడు సాయికుమార్ అన్నారు. యువ కథానాయకుడు కిరణ్‌తో కలిసి ఆయన నటించిన చిత్రమిది. ఇప్పటివరకూ థియేటర్‌లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా అలరిస్తోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయికుమార్‌ మాట్లాడుతూ.. చక్కటి టీంతో కలిసి పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావించానని తెలిపారు. ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని అన్నిచోట్ల ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎన్నో ఆంక్షల మధ్య ఈ చిత్రాన్ని చేశామని, అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లను కూడా మన్నించి ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరించారని కథానాయకుడు కిరణ్ అన్నారు. వచ్చే చిత్రాల్లో అలాంటి పొరపాట్లుకు తావులేకుండా చక్కటి వినోదాన్ని పంచే చిత్రాలను అందిస్తానని తెలిపారు. ఓటీటీలోనూ ఇంటిల్లిపాది తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని