ఈ మహాయుద్ధంలో మనం గెలవాలంటే.. - sai kumar along with ap police
close
Published : 28/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ మహాయుద్ధంలో మనం గెలవాలంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కరోనాని తరిమికొట్టేందుకు ప్రజలంతా మాస్క్‌ ధరించాలని, క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని’ కోరారు నటుడు సాయి కుమార్‌. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులతో కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ముందుకొచ్చారాయన. కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు ఏవేం చేయాలో తనదైన శైలిలో తెలియజేశారు. సంబంధిత వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ.

‘ఈ రోజు మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచమంతా ఓ సవాలు ఎదుర్కొంటోంది. అదే కరోనా. కరోనాని కట్టడి చేయడం మన తక్షణ కర్తవ్యం. అందుకే ఈ విన్నపం. ఆలకించండి.. ఆలోచించండి.. ఆచరించండి. కనిపించే శత్రువుతో చేసేది యుద్ధం. కనిపించని కరోనా వైరస్‌తో చేసేది మహా యుద్ధం. ఇందులో మనం గెలవాలంటే, కరోనా వైరస్‌ పారిపోవాలంటే, మన పంచ ప్రాణాలని కాపాడుకోవాలంటే ఈ పంచ సూత్రాల్ని మనం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు సాయి కుమార్‌. మరి ఆ నియమాలేంటో వీడియో చూసి తెలుసుకోండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని