Allu Arha Akira Nandan: నెట్టింట సందడి చేస్తోన్న అకీరా, అర్హ - telugu news allu arha and akira nandan
close
Published : 03/08/2021 17:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arha Akira Nandan: నెట్టింట సందడి చేస్తోన్న అకీరా, అర్హ

ఇంటర్నెట్‌ డెస్క్‌: అకీరా నందన్‌.. ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్ తనయుడు. అర్హ.. అల్లు అర్జున్‌ తనయ. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరికీ ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. తన ముద్దు ముద్దు మాటలతో అర్హ, స్టైలిష్‌ లుక్స్‌తో అకీరా నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరూ నెట్టింట సందడి చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఏం చేశారంటే?అర్హ ‘శాకుంతలం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో  భరతుడిగా కనిపించనుంది అర్హ. ఇప్పటికే ఓ షెడ్యూల్‌కి సంబంధించిన చిత్రీకరణలో పాల్గొన్న అర్హ మరోసారి సెట్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మేకప్‌మెన్‌ అర్హకి మేకప్‌ వేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పవన్‌ కల్యాణ్‌ కర్రసాము చేస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు పండగే. అదే తరహాలో అకీరా సైతం కర్రని తిప్పుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘తండ్రికి తగ్గ తనయుడు’ అని అభిమానులతో అనిపించుకుంటున్నాడు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని