Anushka: ప్రభాస్‌.. నీకెప్పుడూ ది బెస్టే లభించాలి: అనుష్క - telugu news celebrities birthday wishes to prabhas
close
Published : 23/10/2021 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anushka: ప్రభాస్‌.. నీకెప్పుడూ ది బెస్టే లభించాలి: అనుష్క

పాన్‌ ఇండియా స్టార్‌కి బర్త్‌డే విషెస్‌

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కి అంతా మంచే జరగాలని అగ్రకథానాయిక అనుష్కశెట్టి కోరుకున్నారు. ప్రభాస్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం ఉదయం ఆమె ట్విటర్‌ వేదికగా స్పెషల్‌ విషెస్‌ తెలిపారు. ‘‘హ్యాపీ, హ్యాపీ బర్త్‌డే. జీవితంలో కేవలం ది బెస్ట్‌ మాత్రమే నీకు లభించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమందికి నీ సినిమాలు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాను’’ అని అనుష్క ట్వీట్‌ చేశారు. మరోవైపు రెబల్‌స్టార్‌ అభిమానులే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

‘‘నా డార్లింగ్‌ ప్రభాస్‌ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని.. మరింత సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. అరేయ్‌ వంశీ.. వచ్చేటప్పుడు ఒక కొత్త ఇంటర్నెట్‌ తీసుకురా. మన రాధేశ్యామ్‌ టీజర్‌ ఈరోజు విడుదలైంది. పాత ఇంటర్నెట్‌ బద్దలైపోయిద్దేమో’’ - నవీన్‌ పోలిశెట్టి

‘‘మన గర్వం, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. స్టన్నింగ్‌ విజువల్స్ వల్ల రాధేశ్యామ్‌ టీజర్‌ అద్భుతం, ఆసక్తికరంగా ఉంది. టీమ్‌ మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌’’ - శ్రీనువైట్ల

‘‘రాజాధిరాజా రాజ మార్తాండ మహారాజా భారత సినీ పరిశ్రమను ఏలుతున్న యువరాజా శ్రీ ప్రభాస్ రాజాకి జన్మదిన శుభాకాంక్షలు’’ - బండ్ల గణేశ్‌

‘‘ఈశ్వర్‌గా వెండి తెరమీద అడుగుపెట్టి, వర్షంతో అభిమానుల గుండెల్లో హర్షాతిరేకాలు ఉప్పొంగించి, ఛత్రపతితో మాస్ ప్రేక్షకులను అలరించి, బాహుబలితో కైలాసమంత ఎత్తు ఎదిగిన ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు’’ - పరుచూరి గోపాలకృష్ణ

Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని