Kajal: అక్కినేని ఫ్యాన్స్‌కు కాజల్‌ సర్‌ప్రైజ్‌..! - telugu news kajal gives surprise to akkineni fans
close
Published : 29/08/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kajal: అక్కినేని ఫ్యాన్స్‌కు కాజల్‌ సర్‌ప్రైజ్‌..!

హైదరాబాద్‌: అక్కినేని అభిమానులకు అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌  స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆదివారం కింగ్‌ నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె దానిని రివీల్‌ చేశారు‌. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కాజల్‌ కథానాయిక. ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ను కాజల్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి  ‘ది ఘోస్ట్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో నాగార్జున మరింత యంగ్‌, సీరియస్‌ లుక్‌లో.. కత్తి చేతబట్టి.. రౌడీలపాలిట ఘోస్ట్‌ల దర్శనమిచ్చారు.

ఈ మధ్యకాలంలో నాగార్జున పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్లతో సినీ ప్రియుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘వైల్డ్‌డాగ్‌’ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిదే. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సునీల్‌ నారంగ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ని ఇష్టపడేవారికి ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని