పురుషులను లాఠీలతో చితకబాదిన మహిళలు - traditional lathmar holi celebrated in mathura
close
Updated : 24/03/2021 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పురుషులను లాఠీలతో చితకబాదిన మహిళలు

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో వింత ఆచారం

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంప్రదాయంగా నిర్వహించే ‘లాఠీ మార్‌’ వేడుకలు అలరిస్తున్నాయి. రంగులు చల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు మహిళలు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీ మార్‌ హోలీ ప్రత్యేకత. రెండు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో లాఠీ మార్‌ వేడుకలు నిర్వహించగా బుధవారం బర్సానా, నందగావ్‌లో వేడుకలు జరుపుకొన్నారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా.. రాధా తదితరులు కృష్ణుడిని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీ మార్‌ దాడి నుంచి తప్పించుకునేందుకు పురుషులు కవచాలను కూడా ధరిస్తారు. లాఠీ మార్‌కు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని