‘ఆర్‌.సి 15’.. ఆ ముగ్గురిలో ఎవరు? - who is the director of rc 15
close
Published : 11/02/2021 21:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌.సి 15’.. ఆ ముగ్గురిలో ఎవరు?

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు రామ్‌ చరణ్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీంగా  తారక్‌ కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయ్యాక ఎవరి దర్శకత్వంలో వీళ్లు నటిస్తారు? అనే ప్రశ్నకు తారక్‌ విషయంలో సమాధానం దొరికింది. కానీ, చరణ్‌ విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. త్రివిక్రమ్‌తో గతేడాది ఓ చిత్రం ఖరారు చేశారు తారక్‌. హారికా హాసిని సంస్థ నిర్మించనుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. దీంతోపాటు ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారాయన. ఇటీవలే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

తారక్‌ ఇలా రెండు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడితే చరణ్‌ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.   త్వరలోనే చరణ్‌ ఆయన అభిమానులకు ఆ  శుభవార్త చెప్పనున్నారని సమాచారం. కథానాయకుడిగా ఆయన నటించనున్న 15వ సినిమా గురించి ఆసక్తికర వార్త వినిపించబోతున్నారని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ‘ఆర్‌.సి.15’ (వర్కింగ్‌ టైటిల్‌) దర్శకుడు ఇతనే అంటూ ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి. తమిళ దర్శకులు శంకర్, లోకేశ్‌ కనకరాజ్‌, తెలుగు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఈ జాబితాలో నిలిచారు. ఈ డైరెక్టర్లు చరణ్‌కి కథ చెప్పారని, దాదాపు అన్ని స్ర్కిప్టులు ఆయనకు నచ్చాయని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరి రామ్‌ చరణ్‌ తన 15వ సినిమాకు ఎవర్ని సారథిగా ఎంపిక చేసుకున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తోపాటు ‘ఆచార్య’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు చరణ్‌. చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

ఇదీ చదవండి..

ఆ ఇంటి వల్ల నిద్ర కూడా పోలేదు: కాజల్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని