6 నెలల చిన్నారిపై క్వారంటైన్‌ కేసు!

తాజా వార్తలు

Published : 25/04/2020 00:44 IST

6 నెలల చిన్నారిపై క్వారంటైన్‌ కేసు!

డెహ్రాడూన్‌: లాక్‌డౌన్‌ సమయంలో హోం క్వారంటైన్‌ నిబంధనలను అతిక్రమించినందుకు 51 మందిపై ఉత్తరాఖండ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వారిలో ఆరు నెలలు, మూడేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌  రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో చోటుచేసుకుంది. జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం ఎనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరాదు. ఈ విషయమై విచారణకు ఆదేశాలు జారీచేశామని ఆ జిల్లా కలెక్టర్‌‌ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన జిల్లా కొవిడ్‌-19 అధికారి‌ సస్పెన్షన్‌తో సహా క్రమశిక్షణ చర్యలు చేపడతామని ఆయన వివరించారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని