close

తాజా వార్తలు

Updated : 03/12/2020 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల డ్రగ్స్‌ దందా

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో బహిర్గతం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చిక్కిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

ఈనాడు, హైదరాబాద్‌: వృత్తి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. ప్రవృత్తి డ్రగ్స్‌ దందా. ఆకర్షణీయమైన వేతనంతో గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నా.. వ్యసనాల వల్ల కటకటాలపాలు కావాల్సి వచ్చింది. గోవా, విశాఖపట్నం ఏజెన్సీల నుంచి మాదకద్రవ్యాల్ని తీసుకొచ్చి విక్రయిస్తూ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చిక్కారు. మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన శివసేనారెడ్డి(27), వనస్థలిపురం కమలానగర్‌ వాసి మేక సాయి విపిన్‌(27), ఘట్‌కేసర్‌ పోచారంలోని సింగపూర్‌ టౌన్‌షిప్‌ నివాసి హర్షవర్ధన్‌ ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. మాదకద్రవ్యాల్ని విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం తార్నాకలో మాటేసింది. బైకుపై వచ్చిన శివసేనారెడ్డి, సాయి విపిన్‌లను ఆపి తనిఖీ చేయడంతో 150 మైక్రోగ్రాముల చొప్పున 56 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, 12 గ్రాముల చొప్పున గల రెండు హషిష్‌ ఆయిల్‌ సీసాలు లభ్యమయ్యాయి. విచారించగా ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను గోవా నుంచి తెచ్చి ఒక్కోటి రూ.2000 చొప్పున విక్రయిస్తున్నట్లు శివసేన తెలిపాడు. హర్షవర్ధన్‌ నుంచి తాను హషిష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు సాయి విపిన్‌ ఒప్పుకొన్నాడు. రూ.2,500కు 12 గ్రాముల సీసా కొని రూ.4వేలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు సింగపూర్‌ టౌన్‌షిప్‌లోని హర్షవర్ధన్‌ ఫ్లాట్‌లో తనిఖీ చేయగా హషిష్‌ ఆయిల్‌ గుర్తించారు. వైజాగ్‌కు చెందిన కార్తీక్‌ నుంచి కిలోకు రూ.లక్ష వెచ్చించి కొనుగోలు చేస్తున్నానని, రూ.2,500కు 12 గ్రాముల చొప్పున విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. శివసేనారెడ్డి మూడేళ్ల క్రితం కూడా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందానికి చిక్కాడు. పరారీలో ఉన్న కార్తిక్‌ కోసం గాలిస్తున్నారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల్లో గత రెండు నెలల్లో 10 మంది చిక్కారు. వీరంతా చదువుకొనే రోజుల్లోనే గంజాయికి అలవాటు పడి రవాణాదారులుగా మారినట్లు అధికారులు వెల్లడించారు.



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని