Crime News: హయత్‌నగర్‌లో దారుణం.. భార్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి..

తాజా వార్తలు

Updated : 24/09/2021 10:34 IST

Crime News: హయత్‌నగర్‌లో దారుణం.. భార్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి..

హయత్‌నగర్‌: హైదరాబాద్‌ పరిధిలోని హయత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య మృతదేహాన్ని బాతుల చెరువు అలుగువద్ద పడేస్తుండగా స్థానికులు సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసుల కథనం మేరకు హయత్‌నగర్‌ పాత రోడ్డుకు సమీపానే ఉన్న హనుమాన్‌ మందిరం పక్కనే ఉన్న గల్లీలో డేగ శ్రీను, భార్య లక్ష్మీ(30), కుమార్తె, కుమారుడితో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. 

గురువారం రాత్రి సుమారు 10.45 గంటలకు శ్రీను అతని స్నేహితుడు కోడూరి వినోద్‌తో కలిసి లక్ష్మీ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బాతుల చెరువు అలుగువద్ద పడేస్తుండగా స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. తన భార్య అనారోగ్యంతో మృతిచెందిందని డబ్బులు లేక ఆమె మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్లినట్లు శ్రీను చెబుతున్నాడు. సీఐ సురేందర్‌ సిబ్బందితో కలిసి మృతురాలి ఇంటిని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంతో చనిపోయిందా లేక మరేదైనా కారణమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని